విజయవాడ
వైసిపి నాయకులు దోపిడీ చేస్తూ నీతులు చెబుతున్నారు. విజయసాయిరెడ్డి గురివింద గింజ మాటలు మానుకోవాలి. బిజెపి మీద, మా అధ్యక్షురాలి గురించి మాట్లాడటానికి సిగ్గుండాలి. వైసిపి నాయకులంటే డైవర్షన్ పాలిటిక్స్ కి పెట్టింది పేరని అన్నారు. జగన్మోహన్ రెడ్డి అవినీతి ని ప్రశ్నిస్తే మా అధ్యక్షురాలి పై విమర్శలు చేస్తారా. కల్తీ మద్యం తో పేదలు చనిపోయింది వాస్తవం కాదా. మైనింగ్, ఇసుక ద్వారా కోట్లు దోచుకున్నది నిజం కాదా. కేంద్రం నిధులు ఇస్తే ఆ పధకాలకు మీ పేర్లు పెట్టుకున్నారు. చెత్త నుంచి మరుగుదొడ్ల వరకు పన్నులు వసూళ్లూ చేస్తున్నారు. విద్యుత్ బిల్లులతో పేద, మధ్య తరగతి ప్రజలు అల్లాడుతున్నారు. మీ చేతకాని పాలనతో దేశంలోనే రాష్ట్రం పేరు చెడగొట్టారు. ఎన్నికలలో ఓట్ల కోసం నోటికొచ్చిన హామీలు ఇచ్చారు. మీ మాటలు నమ్మి ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు. నాలుగున్నరేళ్లల్లో అభివృద్ధి ఎంత చేశారో చెప్పే ధైర్యం ఉందా. మీ అవినీతి గురించి పెద్ద చిట్టా చెబుతున్నాం... చర్చకు రండి. సమాధానం చెప్పలేక మా అధ్యక్షురాలి పై వ్యక్తిగత విమర్శలు చేస్తారా. విజయసాయి రెడ్డి, మంత్రులు కు బుర్ర ఉండే మాట్లాడుతున్నారాని అన్నారు.
జగన్మోహన్ రెడ్డి వారితో మాట్లాడిస్తున్నారా. విజయసాయి రెడ్డి ఎవరో తెలియక ముందే పురంధేశ్వరి ఎంపి అయ్యారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోట్లు దోచుకున్న చరిత్ర జగన్ ది. యన్టీఆర్ సిఎం గా ఉన్నా... ఒక్క అవినీతి మచ్చ మా నాయకురాలి మీద లేదు. బిజెపి అడిగిన వాటికి సమాధానం చెప్పే దమ్ము ఉందా. పైగా బెదిరించేలా మా మహిళా నేత పై వ్యాఖ్యలు చేస్తారా. మీకు చిత్తశుద్ధి ఉంటే అవినీతి చేయలేదని చెప్పండి. మీ నిజాయితీ నిరూపించుకునే ధైర్యం ఉందా. ఇంకోసారి నోరు పారేసుకుంటే .. మా మహిళలమే విజయసాయి రెడ్డి కి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.