YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అసంతృప్త నేతలకు దారెటు

అసంతృప్త నేతలకు దారెటు

విజయవాడ, నవంబర్ 10,
రాజకీయ పార్టీలలో ఎన్నికల సమయంలో అలకలు, అసంతృప్తులు సహజమే అయినా ఏపీలో చాలామంది అసంతృప్త నేతలకు ఇప్పుడు రెండో ఆప్షన్ లేకుండా పోయింది. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన వారిలో 151మంది అభ్యర్ధులు గెలుపొందారు.2024 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలనే ఉద్దేశంతో రకరకాల ప్రచారాలు ప్రారంభించారు. రకరకాల కార్యక్రమాలతో వైసీపీ కాంపెయిన్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది.ప్రచార కార్యక్రమాల కంటే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ ద్వారా వైసీపీ ఎక్కువ లాభపడినట్టు భావిస్తోంది. చంద్రబాబు అరెస్ట్‌తో తమ పార్టీకి గణనీయంగా సానుభూతి లభించిందని టీడీపీ భావిస్తున్నా వైసీపీ మాత్రం తమ పార్టీ నేతలకు గట్టి సందేశం పంపగలిగినట్టు భావిస్తోంది. వైసీపీలో అసంతృప్త నేతలు ఫిరాయింపులకు పాల్పడకుండా, ఎన్నికల సమయంలో పార్టీని దెబ్బతీయకుండా చంద్రబాబు అరెస్ట్‌ ఉపయోగపడిందని భావిస్తున్నారు.చంద్రబాబు రిమాండ్‌లో ఉన్న 53రోజుల్లో టీడీపీ కార్యక్రమాలు పూర్తిగా స్తంభించిపోయాయి. చంద్రబాబు లేకపోతే టీడీపీ బలం ఏమి ఉండదనే అంచనాకు వైసీపీ వచ్చేసింది. వైద్యపరీక్షలు, శస్త్ర చికిత్స కోసం బాబుకు బెయిల్‌ లభించినా ఎన్నికల సమయానికి మళ్లీ ఏదొక కేసులో అరెస్ట్‌ చేసే అవకాశాలు లేకపోలేదని ప్రచారం జరుగుతోంది.మరోవైపు చంద్రబాబు అరెస్ట్‌కు కొద్ది నెలల ముందు టీడీపీ దూకుడుగా వ్యవహరించింది.ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో అధికార పార్టీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలోకి వెళ్లారు. ఎన్నికల నాటికి రకరకాల కారణాలతో మరికొందరు పార్టీని వీడి తెలుగుదేశం గూటికి చేరుతారని ప్రచారం జరిగింది. చంద్రబాబు అరెస్ట్‌ తదనంతర పరిణామాలతో ఇప్పుడు వైసీపీలో ఉన్న అసంతృప్త నేతలకు మరో ప్రత్యామ్నయం లేకుండా పోయింది. చంద్రబాబు ప్రస్తుతం ఎదుర్కొంటున్న కేసులు ఎప్పటికి కొలిక్కి వస్తాయో తెలియని పరిస్థితుల్లో పార్టీ వీడాలనే ఆలోచనలకు కూడా ముగింపు పలకాల్సిన అవసరం ఏర్పడింది.రానున్న ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు గ్యారంటీ అనే భరోసా వైసీపీలో లేదు. సర్వేలు, పనితీరు ఆధారంగానే టిక్కెట్ల కేటాయింపు ఉంటుందని సిఎం పదేపదే చెబుతున్నారు. టిక్కెట్లు దక్కకపోయినా పార్టీలో ప్రభుత్వంలో తగిన గుర్తింపునిస్తామని బుజ్జగిస్తున్నారు. మంత్రులుగా ఉన్న వారికి కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమనే భరోసా ఇంకా దక్కలేదు.అయితే ఎలాంటి అనుమానం, అభద్రత ఉన్నా నేతలందరికీ వైసీపీలో కొనసాగడం మినహా మరో అవకాశం లేకుండా పోయిందని ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. ప్రత్యర్థులను ఆర్థికంగా కట్టడి చేయడంతో పాటు ఎన్నికల నాటికి వారికి క్యాష్‌ మేనేజ్‌మెంట్‌ చేయకుండా కట్టడి చేయకుండా జగన్ ఇప్పటి నుంచి పక్కా ప్రణాళిక అమలు చేస్తున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.ప్రస్తుతం టీడీపీ ఉన్న పరిస్థితుల్లో టీడీపీ నేతల్ని సంప్రదించడం, ఆ పార్టీలోకి వెళ్లాలనే ప్రయత్నాలు చేయడం కొరివితో తలగోక్కోవడమే అవుతుందని అంచనా వేస్తున్నారు.

Related Posts