YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

గ్రూపు తగదాలుపై కేసీఆర్ ఫైర్

గ్రూపు తగదాలుపై కేసీఆర్ ఫైర్

నిజామాబాద్, నవంబర్ 10,
స్వయంగా తెలంగాణ సీఎం కేసీఆర్ కామారెడ్డి  నుంచి పోటీ చేస్తూంటే అక్కడి పార్టీ నేతలు కొంత మంది  కాంగ్రెస్ లో చేరడం సంచలనం సృష్టించింది.  ఇదంతా నేతల మధ్య గ్రూపు తగాదాల కారణంగానే చోటు చేసుకోవడంతో అక్కడి నేతలకు కేసీఆర్  క్లాస్ తీసుకున్నారు. గ్రూప్ తగాదాలు వీడాలని ఆదేశించారు. ఇగోలు పక్కన పెట్టి పార్టీ కోసం ప్రతి కార్యకర్తలతో కలిసి పని చేయాలని సూచించారు. గురువారం నామినేషన్ వేసేందుకు కామారెడ్డికి వెళ్లిన కేసీఆర్ అక్కడ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఇంట్లో నియోజకవర్గ నేతలతో సమావేశం అయ్యారు. నియోజకవర్గ పార్టీ పరిస్థితిపై సమీక్షించారు. ఇటీవల కామారెడ్డి బీఆర్ఎస్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలు, వివాదాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా నేతల తీరుపై గులాబీ బాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమిష్టిగా పని చేయాలని, పార్టీ గీత దాటితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. నేతలు ఇలా విభేదించుకుంటే ఎన్నికల్లో పార్టీ నుంచి తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఇటువంటి పరిస్థితి తీసుకురావొద్దని సూచించారు.   ఎమ్మెల్యే గంప గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి తో పాటు ముఖ్య నేతలందరూ పాల్గొన్నారు.కామారెడ్డిలో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్ కు స్థానిక నేతల మధ్య విభేదాలు ఛాలెంజింగ్ గా మారాయి. నియోజకవర్గ ముఖ్యనేతలైన తిరుమల్ రెడ్డి, మున్సిపల్ వైస్ ఛైర్ పర్సన్ భర్త చంద్రశేఖర్ రెడ్డికి వాగ్వాదం జరగగా చంద్రశేఖర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో తన భార్యతో పాటు ఆయన కాంగ్రెస్‌లో చేరారు. ఈ ఘటన మరువక ముందే మాచారెడ్డి జడ్పీటీసీ, ఎంపీపీ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇందులో జడ్పీటీసీ మినుకూరి రాంరెడ్డికి స్వల్ప గాయాలు అయ్యాయి. దీంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కామారెడ్డిలో పార్టీ నేతల మధ్య సమన్వయం లోపిస్తుండటం బీఆర్ఎస్ వర్గాల్లో కలకలం రేపుతోంది. దీంతో పరిస్థితి ఇలాగే కొనసాగితే డ్యామేజ్ తప్పదని భావించిన కేసీఆర్ తాజాగా స్వయంగా రంగంలోకి దిగారు. గులాబీ బాస్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలో పోటీ చేస్తున్నారు. కామారెడ్డిలో పోటీ చేయడానికి ప్రత్యేకమైన వ్యూహం ఉందని కేసీఆర్ చెబుతున్నారు. అదేమిటన్నది ఆయన ప్రకటించడం లేదుకానీ విజాయన్ని పార్టీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆయనను ఓడించాలన్న లక్ష్యంతో..  టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ఆయనపై కాంగ్రెస్ పోటీకి నిలబెట్టింది.

Related Posts