విజయవాడ
స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ ఈ నెల 15కు వాయిదా పడింది. అదనపు ఏజీ హాజరు కాలేకపోతున్నట్లు సీఐడీ ప్రత్యేక పీపీ వివేకానంద కోర్టుకు తెలిపారు. ఈ నేపధ్యంలో కోర్టును అయన మరింత సమయం కోరారు. విచారణను ఈనెల 22కు వాయిదా వేయాలన్న అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. మరోసారి గడువు పొడిగించేది లేదని తేల్చి చెప్పింది. విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది.