YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం విదేశీయం

వ‌ర‌ల్డ్ క‌ప్‌లో రికార్డుల వీరుడికి ఐసీసీ అవార్డు..

వ‌ర‌ల్డ్ క‌ప్‌లో రికార్డుల వీరుడికి ఐసీసీ అవార్డు..

న్యూడిల్లీ నవంబర్ 10
న్యూజిలాండ్ యువ ఓపెన‌ర్ రచిన్ ర‌వీంద్ర‌ ప్ర‌తిష్ఠాత్మ‌క ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలుచుకున్నాడు. అక్టోబ‌ర్ నెల‌కుగానూ అత‌డు ఈ అవార్డు అందుకున్నాడు. ఆరంగేట్రం వ‌రల్డ్ క‌ప్‌లో రికార్డులు బ‌ద్ద‌లు కొడుతున్న ఈ యంగ్‌స్ట‌ర్ నామినేట్ అయిన మొదటిసారే విజేత‌గా నిల‌వ‌డం విశేషం.ఐసీసీ నిర్వ‌హించిన‌ పోలింగ్‌లో భార‌త పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా, ద‌క్షిణాఫ్రికా ఓపెన‌ర్ క్వింట‌న్ డికాక్ కంటే ఎక్కువ ఓట్లతో ఈ కివీ బ్యాట‌ర్ అవార్డును ఎగ‌రేసుకుపోయాడు. ‘ఐసీసీ అవార్డు గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. నాతో పాటు జ‌ట్టుకు ఈ నెల చాలా ప్ర‌త్యేకం. భార‌త్‌లో వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడ‌డం మ‌రింత ప్ర‌త్యేకం’ అని ర‌వీంద్ర అన్నాడు. ఇక మ‌హిళ‌ల విభాగంలో వెస్టిండీస్ ఆల్‌రౌండ‌ర్ హేలీ మాధ్యూస్విజేతగా నిలిచింది. దాంతో, ఈ అవార్డు కోసం పోటీప‌డిన‌ న్యూజిలాండ్ ఆల్‌రౌండ‌ర్ అమేలియా కేర్, బంగ్లాదేశ్ స్పిన్న‌ర్ న‌హిదా అక్త‌ర్‌ల‌కు నిరాశే మిగిలింది.ప్ర‌పంచ క‌ప్‌లో వీర విహారం చేస్తున్న‌ కివీ ఓపెన‌ర్ ర‌చిన్ ర‌వీంద్ర రికార్డులు తిర‌గ‌రాస్తున్నాడు. మేటి బౌల‌ర్ల‌ను అల‌వోక‌గా ఎదుర్కొంటూ.. భార‌త లెజెండ్ స‌చిన్ టెండూల్క‌ర్ రికార్డుల‌ను బ‌ద్ధ‌లు కొడుతున్నాడు. ఈ మెగా టోర్నీ మొద‌లైన‌ అక్టోబ‌ర్ నెల‌లో ర‌చిన్ ఏకంగా 406 ప‌రుగులు సాధించాడు. ఈ టోర్నీలో అత్య‌ధిక ప‌రుగుల వీరుడిగా మ‌రో రికార్డు నెల‌కొల్పాడు. ఇప్ప‌టివ‌ర‌కూ 9 ఇన్నింగ్స్‌ల్లో మూడు సెంచ‌రీలతో క‌లిపి 565 ప‌రుగులు కొట్టాడు.అంతేకాదు ప్ర‌పంచ క‌ప్‌లో 5 సార్లు 50ప్ల‌స్ స్కోర్ చేసిన మూడో కివీ బ్యాట‌ర్‌గా ర‌చిన్ రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. గురువారం శ్రీ‌లంక‌పై అద్భుత విజ‌యంతో న్యూజిలాండ్ సెమీస్ బెర్తుకు మ‌రింత చేరువైంది. ర‌న్‌రేటులో పాకిస్థాన్ కంటే మెరుగ్గా ఉండ‌డంతో కేన్ విలియ‌మ్స‌న్ సేన‌కే నాలుగో బెర్తు ద‌క్కే చాన్స్ ఉంది. అదే జ‌రిగితే.. న‌వంబర్ 15న తొలి సెమీఫైన‌ల్లో భార‌త్, బ్లాక్‌క్యాప్స్ త‌ల‌ప‌డ‌నున్నాయి. ఇక టీమిండియాకు 2019 ఎడిష‌న్‌ సెమీఫైన‌ల్లో ఎదురైన ప‌రాభ‌వానికి ప్ర‌తీకారం తీర్చుకొనే స‌మ‌యం రానే వ‌చ్చింది.

Related Posts