YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

దిశ యాప్‌తో భారీగా శిక్షలు

దిశ యాప్‌తో భారీగా శిక్షలు

విశాఖపట్టణం, నవంబర్ 11,
ఏపి సర్కార్ విప్లాత్మకంగా తీసుకుని వచ్చిన దిశా యాప్ రాష్ట్ర వ్యాప్తంగా దూసుకుపోతుంది. మహిళల చేతిలో ఆయుధంగా ఆకతాయిల ఆట కట్టిస్తుంది. ఆపదలో ఉన్నవారికి అండగా ఉంటూ బాధితులు స్వేచ్చగా, నేరుగా ఫిర్యాదు చెయ్యటానికి 24 గంటలు అందుబాటులో ఉన్న దిశా యాప్ నిందితులకు చుక్కలు చూపిస్తుంది. ఆపదలో ఉన్న వారికి అండగా ఉండటం మాత్రమే కాదు నేరాలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు వెయ్యటంలోను దిశా యాప్ సమర్థవంతంగా ముందుకు దూసుకుపోతుంది. అన్ని వర్గాలకు చెందిన మహిళలు, చిన్నారు లు, ఎస్సీ ఎస్టీ అణగారిన వర్గాల మహిళలు, పిల్లలకు న్యాయం చెయ్యటంలో దిశా యాప్ గణనీయమైన పాత్ర పోషిస్తుంది.ఇప్పటి వరకు దిశా యాప్ ను 1.52 కోట్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. 28,585 ఘటనల్లో బాధితులు ఇప్పటి వరకు దిశ సహాయం అందుకున్నారు. దిశా కాల్స్ కోసం 51 మంది పని చేస్తూ 24 గంటలు కాల్ సెంటర్ అందుబాటులో ఉంటుంది. 18 దిశా ప్రత్యేక పోలీస్ స్టేషన్స్, 21 మంది పీపీలు, 25 ప్రత్యేక కోర్టులు దిశా కార్యక్రమాన్ని సమర్థవతంగా అమలు చేస్తున్నాయి. 900 వాహనాలు దిశా కోసం పని చేస్తున్నాయి.కాల్ చేసినా లేదా దిశా యాప్ క్లిక్ చేసిన సిటీల్లో అయితే ఐదు నిమిషాల్లో గ్రామీణ పలెల్లో అయితే 15 నిమిషాల్లో ఘటాన స్థలానికి చేరుకుని బాధితులకు అండగా ఉంటున్నారు. ప్రత్యేక వాహనాలు, క్లూస్ టీమ్, ఫోరెన్సిక్, అవసరమైన మౌలిక సదుపాయాలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వటంతో దిశా కేసుల విచారణ సమయం పొక్సో కేసుల్లో 44 రోజులకు , అత్యాచార, లైంగిక వేధింపుల ఘటనల్లో విచారణ 60 రోజుల్లో ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తున్నారు. నమోదైన కేసుల్లో 91 శాతం కేసులు విచారణ పూర్తి చేసిన ఘనత ఏపి కు ఉంది. దేశంలో దీని సగటు 40 శాతం మాత్రమే ఉంది. కంప్లియన్స్ రేటులో ఏపి ప్రధమ స్థానంలో ఉంది. దిశా కార్యక్రమం ప్రారంభం అయిన తర్వాత జూన్ 15 ,2003 వరకు 152 కేసుల్లో కటిన శిక్షలు పడ్డాయి. 5 గురికి ఊరి శిక్షలు పడితే,53 మందికి పైగా జీవిత ఖైదీ శిక్షలు పడ్డాయి. 20 ఏళ్ళు పైబడి 40 మందికి,10 ఏళ్లకు పై బడి 41 మందికి, 7 ఏళ్లకు పై బడి 13 మందికి శిక్షలు పడ్డాయి.

Related Posts