గుంటూరు, నవంబర్ 11,
రాయలసీమలో కర్ణాటక సరిహద్దులకు ఆనుకుని ఉండే ఉమ్మడి అనంతపురం జిల్లాలో రోడ్ల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అనంతపురం నుంచి అటు విజయవాడ, ఇటు గుంటూరులను అనుసంధానించేలా రూపొందించిన రోడ్ల నిర్మాణ ప్రాజెక్టులు వేగం పుంజుకొన్నాయి. బెంగళూరు నుంచి విజయవాడకు అనుసంధానించేలా చేపట్టిన గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులు ఇదివరకే మొదలయ్యాయి. గోరంట్ల-కదిరి-పులివెందుల, యర్రగుంట్ల, కమలాపురం, మైదుకూరు, పోరుమామిళ్ల మీదుగా ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం సాగుతుంది. నెల్లూరు జిల్లాలోని సీతారాంపురం, ప్రకాశం జిల్లా కంభం, పామూరు, కనిగిరి, అద్దంకి మీదుగా ముప్పవరం వరకు రోడ్డు కనెక్టివిటీ ఉంటుంది. ముప్పవరం అక్కడి జాతీయ రహదారితో దీన్ని కనెక్ట్ చేస్తారు. నాలుగు ప్యాకేజీలుగా దీన్ని నిర్మించే అవకాశాలు ఉన్నాయి. అటు అనంతపురం గుంటూరు మధ్య 9,000 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయంతో చేపట్టిన నాలుగు లేన్ల జాతీయ రహదారి నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ హైవేకు కేంద్రం ఇదివరకే 544డీ నంబర్‌ను కేటాయించింది. ఈ రోడ్డు పొడవు 418 కిలోమీటర్లు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం 32,000 కోట్ల అంచనా వ్యయంతో అనంతపురం నుంచి అమరావతికి ఆరు లేన్ల ఎక్స్‌ప్రెస్ వేను ప్రతిపాదించింది గానీ అది పట్టాలెక్కలేదు. దీనికోసం 22,000 ఎకరాల భూసేకరణ చేయాల్సి రావడం, దీన్ని భరించడానికి అటు కేంద్రం గానీ, చంద్రబాబు ప్రభుత్వం గానీ ఆసక్తి చూపలేదు. నంద్యాల దాటిన తరువాత ఈ రహదారి నల్లమల్ల పులుల అభయారణ్యం నుంచి వెళ్లేలా చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపాదనలు చేయడం వల్ల పర్యావరణ అనుమతులు లభించలేదు. ఈ జాతీయ రహదారి కోసం అటవీ భూములను కేటాయించడానికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నిరాకరించింది. 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనంతపురం - అమరావతి ఎక్స్‌ప్రెస్ వే ప్రాజెక్టును పునఃసమీక్షించింది. కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు పొందటం కష్ట సాధ్యమని గుర్తించింది. స్కూల్ లో మీటింగ్ కు వెళ్లిన భార్య, అపార్ట్ మెంట్ లో బ్యాంక్ జనరల్ మేనేజర్ ?, సీసీటీవీల్లో! ప్రత్యామ్నాయంగా అనంతపురం-గుంటూరు మధ్య నాలుగు లేన్ల జాతీయ రహదారి నిర్మాణ ప్రతిపాదనలు రూపొందించింది. ఈ ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో పనులు వేగంగా కొనసాగుతున్నాయి.