YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

టాలీవుడ్ లో తీవ్ర విషాదం నటుడు చంద్రమోహన్ కన్ను మూత

టాలీవుడ్ లో  తీవ్ర విషాదం నటుడు చంద్రమోహన్ కన్ను మూత

హైదరాబాద్
టాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు చంద్రమోహన్ (80) కన్నుమూశారు. గుండె సంబంధిత సమస్యలతో కొద్దిరోజులుగా బాధపడుతున్న ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కృష్ణా జిల్లా పమిడిముక్కల గ్రామంలో 1943 మే 23న జన్మించిన ఆయన.. 1966లో రంగులరాట్నం సినిమాతో తెరంగేట్రం చేశారు. మొత్తం 932 సినిమాల్లో వివిధ పాత్రల్లో నటించారు.  చంద్రమోహన్ తో మొదటి చిత్రం చేసిన తారలు స్టార్లు అవుతారని అందరూ అంటుంటారు. జయసుధ, జయప్రద మొదలు సుహాసిని వరకు అందరూ తొలినాళ్లలో ఆయన పక్కన నటించారు. చినవారే. ఎన్నో విలక్షణమైన పాత్రలతో తెలుగు ప్రజల మనసులో చెరిగిపోని స్థానాన్ని సంపాదించుకున్నారు. సోమవారం హైదరాబాద్లో అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. చంద్రమోహన్ కు భార్య జలంధర, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు

Related Posts