YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

చంద్రమోహన్ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం

చంద్రమోహన్ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం

హైదరాబాద్
ప్రముఖ సినీ నటుడు తెలుగు వెండి తెర తొలితరం కథా నాయకుడు చంద్రమోహన్ మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం తెలిపారు.   విభిన్నమైన పాత్రలతో, విలక్షణమైన నటనతో, దశాబ్దాలుగా కోట్లాదిమంది ప్రేక్షకులను అలరించిన చంద్రమోహన్ మరణం, తెలుగు చిత్ర సీమకు తీరనిలోటని సీఎం విచారం వ్యక్తం చేశారు. వారి స్పూర్తితో ఎందరో నటీ నటులు ఉన్నత స్థాయికి ఎదిగారని., కళామతల్లి ముద్దుబిడ్డ గా తెలుగుతో పాటు పలు భాషల్లో లక్షలాదిమంది అభిమానాన్ని  చంద్రమోహన్ సొంతం చేసుకున్నారని సీఎం తెలిపారు.  శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Related Posts