YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కులగణనకు వడివడి అడుగులు

కులగణనకు వడివడి అడుగులు

విజయవాడ, నవంబర్ 13,
ఏపీలో సమగ్ర కుల గణనకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నెల 27 నుంచి ప్రక్రియను ప్రారంభించాలని సర్కారు నిర్ణయించింది. ఈ ప్రక్రియను పూర్తిగా డిజిటల్‌ విధానంలో చేపట్టనుంది. ఇందుకోసం ప్రత్యేక ప్రశ్నావళితో యాప్‌ సిద్ధం చేస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ఈ కుల గణన నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. న్యాయపరమైన సమస్యలు తలెత్తే అవకాశాలు ఉండడంతో వాలంటీర్లను ఇందులో భాగస్వామ్యం చేయడం లేదని తెలుస్తోంది. సచివాలయ ఉద్యోగులు తమ పరిధిలోని ప్రతి ఇంటిని సందర్శించి, సమాచారాన్ని సేకరిస్తారు. వీరు సేకరించిన సమాచారంపై అధికారులు రీవెరిఫికేషన్ కూడా నిర్వహిస్తారు. ప్రతి సచివాలయ పరిధిలో 10 శాతం ఇళ్లల్లో రీ వెరిఫికేషన్ చేస్తారు. ఓ ప్రత్యేక అధికారితో రీ వెరిఫకేషన్ ప్రక్రియ సాగుతుంది. ఈ కార్యక్రమాన్ని సమర్థంగా పూర్తి చేసేందుకు ప్రాంతీయ స్థాయిలోనే సన్నాహక సమావేశాలను నిర్వహించబోతుంది. బీసీ సంక్షేమ శాఖ పర్యవేక్షణలో ఈ గణన జరగనుంది. జిల్లా స్థాయిలో 15, 16 తేదీల్లోనూ ప్రాంతీయ స్థాయిలో 17 నుంచి 24 వరకు రాజమహేంద్రవరం, కర్నూలు, విశాఖ, విజయవాడ, తిరుపతిలో సదస్సులు నిర్వహించనుంది. 6 నెలల వ్యవధిలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని వైసీపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సంపూర్ణ సామాజిక సాధికారతే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం సమగ్ర కుల గణనకు శ్రీకారం చుట్టింది. సమాజంలో అణగారిన వర్గాల వారికి సామాజిక, రాజకీయ, ఆర్థిక, ఆరోగ్య, విద్యా ఫలాలు అందించేందుకు వీలుగా చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని వైసీపీ సర్కార్ తెలిపింది. దాదాపు శతాబ్దం తరువాత చేస్తున్న కుల గణన ద్వారా రాష్ట్రంలో మరిన్ని పేదరిక నిర్మూలన పథకాలు, మానవ వనరుల అభివృద్ధితో పాటు సామాజిక అసమానతలు రూపుమాపేలా ప్రణాళిక రూపొందించవచ్చని పేర్కొంది. రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల కుల గణన కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వం గత అక్టోబర్‌లో నిర్ణయించింది. ఇందులో భాగంగా వెనుకబడిన తరగతి కులాలైన వర్గానికి చెందిన ఉపకులాలు, వాటిలో జనాభా సంఖ్యను గణన చేయనున్నారు. మొత్తం 139 వర్గాలుగా బీసీ కులాలకు ఉపయుక్తంగా ఉండేలా గణన కార్యక్రమం ఉంటుందని మంత్రి తెలిపారు. సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలు, చట్టసభల్లో ప్రాతినిధ్యం కోసం బీసీ కులాల గణన చేపట్టాలని గత కొన్నేళ్లుగా వెనుకబడిన వర్గాలకు చెందిన కులాల ప్రజలు కుల గణన చేపట్టాలని ప్రభుత్వాలను కోరుతున్నాయి. కుల గణనపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కులగణన అమల్లో ఉంది. బీహార్ ప్రభుత్వం కులాల ఆధారంగా డేటాను సేకరించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. పంజాబ్, ఒడిశా ప్రభుత్వాలు కూడా కుల గణనపై సమాచారాన్ని సేకరించేందుకు సర్వేలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఏపీ ప్రభుత్వం కూడా కుల గణనపై ముందడుగు వేసింది.ఏ కులం ఎంత‌మంది ఉన్నార‌నేది నోటిమాట‌గా చెప్పుకోవ‌డం త‌ప్ప స‌రైన గ‌ణాంకాలు ప్ర‌స్తుతం ప్ర‌భుత్వం వ‌ద్ద లేవు. దేశంలో ఇటీవ‌ల బిహార్ ప్ర‌భుత్వం కుల‌గ‌ణ‌న చేప‌ట్టింది. ఏపీలో కూడా స‌మ‌గ్ర కుల‌గ‌ణ‌న ద్వారా పేద‌లు, అట్ట‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల ఉపాధి, ఆదాయం, విద్య‌, ఇలా అన్ని రంగాల్లో వారి స్థితిగతుల‌ను అంచనా వేసేలా స‌ర్వే చేప‌ట్ట‌నుంది ప్ర‌భుత్వం. ఇప్ప‌టికే సంక్షేమ ప‌థ‌కాల ద్వారా అన్ని వ‌ర్గాల‌ను ఆర్ధికంగా పైకి తీసుకొచ్చేలా ప్ర‌భుత్వం ముందుకెళ్తుంది. తాజాగా స‌మ‌గ్ర కుల‌గ‌ణ‌న ద్వారా మ‌రింత ప‌టిష్టంగా ప‌థ‌కాలు అమ‌లుచేస్తామ‌ని చెప్పుకొస్తుంది స‌ర్కార్.స‌మ‌గ్ర కుల‌గ‌ణ‌న కోసం ఎనిమిది నెల‌లుగా ప్ర‌భుత్వం అధ్య‌య‌నం చేసింది. దీనికోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ప్ర‌ణాళిక‌, స‌చివాల‌యాల శాఖ‌ల ముఖ్య‌కార్య‌ద‌ర్శుల‌తో క‌మిటీ వేసింది ప్ర‌భుత్వం. ఆరుగురు అధికారుల క‌మిటీ దేశంలో కుల‌గ‌ణ‌న చేప‌ట్టిన రాష్ట్రాల్లో ప‌ర్య‌టించింది. అక్క‌డ న్యాయ‌ప‌రంగా వస్తున్న ఇబ్బందుల‌ను కూడా ప‌రిశీలించింది. కుల‌గ‌ణ‌న ఎలా చేప‌ట్టాలి. ఎలాంటి డేటా తీసుకోవాలి వంటి అంశాల‌తో ప్ర‌భుత్వానికి నివేదిక ఇచ్చింది. దీని ప్ర‌కారం రాష్ట్రంలో ఉన్న సుమారు కోటీ 60 ల‌క్ష‌ల కుటుంబాల‌ను స‌ర్వే చేయ‌నుంది ప్ర‌భుత్వం. గ్రామ‌,వార్డు స‌చివాల‌యాల సిబ్బంది, వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ వెళ్లి స‌మాచారం సేక‌రించ‌నుంది. ఎప్పుడెప్పుడు ఏం చేయలన్నదానిపై విధివిధానాలు జారీ చేసింది ప్రభుత్వం.
ప్రత్యేక యాప్ ద్వారా వారంలోనే కులగణన..
రాష్ట్రంలో చేపట్టనున్న సమగ్ర కుల గణన కు సంబందించిన విధివిధానాలను సాంఘిక సంక్షేమ శాఖ విడుదల చేసింది. ఎప్పుడెప్పుడు ఎలాంటి కార్యక్రమాలు చేయాలి. రీజినల్ మీటింగ్‌లు, కుల సంఘాలతో మీటింగ్‌లు ఎప్పుడు నిర్వహించాలి. పైలెట్ ప్రాజెక్టుపై పూర్తి షెడ్యూల్ ఇచ్చారు. కులగణన ప్రక్రియ మొత్తం గ్రామ, వార్డు వాలంటీర్లు-సచివాలయ సిబ్బంది ద్వారా జరగనుంది. దీనికోసం ప్రత్యేకంగా యాప్ కూడా తీసుకొచ్చారు. ఇంటింటికీ వెళ్లి తీసుకునే సమాచారం యాప్‌లోనే డిజిటల్ విధానంలో అప్ లోడ్ చేయాలి.
గైడ్ లైన్స్ ఇవే..
సచివాలయ శాఖ నోడల్ ఏజెన్సీ‌గా ఉంటుంది.
ఒకే విడతలో కులగణన పూర్తి చేయాలి.
నవంబర్ 27 లోగా సర్వే పూర్తి చేయాలి.
ఎక్కడైనా మిగిలిపోయిన ఇళ్లు ఉంటే డిసెంబర్ 10వ తేదీకి పూర్తి చేయాలి.
ఇంటింటికి వెళ్ళినప్పుడు ఆధారాల కోసం ఎలాంటి సర్టిఫికెట్లు అడగకూడదు.
ప్రతి వ్యక్తి పేరు, వయసు, లింగం, భూమి(వ్యవసాయ-వ్యవసాయేతర), ఇంట్లోని పశువులు, వృత్తి, అన్నిరకాలుగా వచ్చే ఆదాయం, కులం, ఉపకులం, మతం, విద్యార్హత, నివాసం ఉండే ఇల్లు, మంచినీటి సదుపాయం, టాయిలెట్లు, గ్యాస్ ఉందా లేదా అనే వివరాలు సేకరిస్తారు.
ఈ నెల 16 లోగా 5 సచివాలయాల్లో పైలెట్ సర్వే పూర్తి చేయాలి.
ఈ నెల 15 లేదా 16 తేదీల్లో జిల్లా స్థాయి రౌండ్ టేబుల్ సమావేశాలు.
మేధావులు, నిపుణులు, కుల సంఘాలతో ఈ నెల 17 న రాజమండ్రి, కర్నూలు.. 20 న విశాఖపట్నం,విజయవాడ.. 24వ తేదీన తిరుపతి‌లో రీజినల్ సమావేశాల నిర్వహణ.

Related Posts