నాలుగేళ్లలో నరేగా ద్వారా అద్భుత ప్రగతి సాధించామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఇందులో భాగస్వాములైన అందరికీ అభినందనలని అన్నారు. సోమవారం నాడు నీరు-ప్రగతిపై అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. చంద్రబాబు మాట్లాడుతూ ఇటు ఉన్న పథకాలను సద్వినియోగం చేసుకుంటున్నాం. అటు నిధుల కోసం కేంద్రంపై పోరాడుతున్నామని అన్నారు. ఈ ఒక్క నెలలోనే రూ.928 కోట్ల విలువైన నరేగా పనులు చేశామని, మరో రూ.100 కోట్ల విలువైన పనులు ఈ మూడ్రోజుల్లో పూర్తి చేయాలన్నారు. ఇదే స్ఫూర్తిని ఇకపై కూడా కొనసాగించాలి. పెద్ద ఎత్తున కూలీలకు ఉపాధి కల్పించి శాశ్వత వనరుల సృష్టి జరగాలని అధికారులకు సూచించారు. ఉపాధి హామీలో మార్గదర్శకాలన్నీ పాటించాలన్నారు. లేబర్, మెటీరియల్ కాంపోనెంట్ నిష్పత్తి పాటించాలని సూచించారు. భూసార కార్డులు, విత్తనాల పంపిణీ వెంటనే పూర్తి చేయాలన్నారు. ఈ ఖరీఫ్లో కౌలు రైతులకు పంట రుణాలు పుష్కలంగా ఇవ్వాలన్నారు. కౌలు రైతులకు రూ.3వేల కోట్ల పంట రుణాలు ఇచ్చామని పేర్కొన్నారు. ఐటీడీఏ ప్రాంతాల్లో అన్ని రకాల విత్తనాలు 90 శాతం రాయితీపై ఇవ్వాలన్నారు. మన కన్వర్జెన్స్ దేశానికే నమూనాగా నిలిచింది. భూసార కార్డులు,విత్తనాల పంపిణీ వెంటనే పూర్తిచేయాలని సూచించారు. ఐటిడిఏ ప్రాంతాలలో అన్నిరకాల విత్తనాలు 90% సబ్సిడిపై ఇవ్వాలి. దీనివల్ల గిరిజన ప్రాంతాలలో పంటల ఉత్పాదకత పెరుగుతుంది. గిరిజన రైతులకు మరిన్ని లాభాలు వస్తాయి. నాలుగేళ్లలో వ్యవసాయ శాఖలో మంచి పురోగతి సాధించాం. గత ఏడాదికన్నా భూగర్భజల మట్టం గణనీయంగా పెరిగింది. నీరు-ప్రగతి విజయం వల్ల రూ.500కోట్లు కరెంటు ఆదా అయ్యింది. నదుల అనుసంధానంతో మంచి ఫలితాలు రాబట్టామన్నారు. ఏ ఊళ్లో పడ్డ వానచుక్క ఆ ఊళ్లోనే భూమిలో ఇంకింపజేయాలి. చెరువుల్లో పూడికతీత పనులు ముమ్మరంగా నిర్వహించాలి. జంగిల్ క్లియరెన్స్ పనులు త్వరితగతిన పూర్తిచేయాలని అన్నారు. అభివృద్ధిని ఒక మహా యజ్ఞంలాగా చేస్తున్నాం. మహా యజ్ఞం ఫలితాలు అనుకూలంగా వస్తున్నాయి. 5కోట్ల మందికి సుస్థిర ఆర్ధికాభివృద్ధి చేకూరాలని అన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ఆక్వా ఉత్పత్తుల నాణ్యతపై దృష్టిపెట్టాలి. కాలుష్యం లేకుండా శ్రద్ధ వహించాలని అన్ఆరు. ఆక్వా రైతులకు అన్నివిధాలా అండగా ఉండాలి.విషజ్వరాలు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. రక్షిత తాగునీటిని అందించాలని ఆదేశించారు. గుంటూరులో డ్రైయిన్ల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. తాగునీటి కాలుష్యం లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.