YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

కారు ప్రమాదంలో గాయపడిన నాని..

కారు ప్రమాదంలో గాయపడిన నాని..

యువ క‌థానాయ‌కుడు నాని ప్ర‌యాణం చేస్తున్న కారు ప్ర‌మాదానికి గురైంది. ఈ  ప్రమాదంలో నాని ముక్కుకు, రెండు పళ్లకు, ముఖానికి గాయాలయినట్లు తెలుస్తోంది. కాస్త వివరాల్లోకి వెళితే.. హైద‌రాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లో ఈ రోజు (శుక్ర‌వారం) ఉద‌యం తెల్ల‌వారు ఝామున 4 గంట‌ల ప్రాంతంలో కారులో ప్ర‌యాణిస్తున్నారు నాని. అయితే వాహ‌నం నడుపుతున్న అత‌ని కారు డ్రైవ‌ర్‌.. డ్రైవింగ్ చేస్తూ చేస్తూ నిద్ర‌లోకి జారుకోవ‌డంతో ఈ ప్ర‌మాదం సంభ‌వించింద‌ని తెలుస్తోంది. ఈ యాక్సిడెంట్‌లో నాని ముక్కుకు, రెండు పళ్లకు, ముఖానికి గాయాలయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాని ఓ హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్నారు. అయితే అది ఏ ఆసుపత్రి అన్న వివ‌రాలైతే బ‌య‌ట‌కు రాలేదు. నాని యూనిట్ వ‌ర్గాలను ఈ విష‌య‌మై సంప్ర‌దించి వాస్త‌వ‌మేమిటో తెలుసుకోవాల‌న్నా, అది కుద‌ర‌లేదు. కాగా, నాని ద్విపాత్రాభిన‌యం చేస్తున్న 'కృష్ణార్జున యుద్ధం' చిత్రీక‌ర‌ణ తుదిద‌శ‌కు చేరుకుంది. ఆయ‌న నిర్మించిన 'అ!' ఫిబ్ర‌వ‌రి 16న తెర‌పైకి రానుంది.

 

Related Posts