YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏయూకు డబుల్ గుర్తింపు

ఏయూకు డబుల్ గుర్తింపు

విశాఖపట్టణం, నవంబర్ 16,
ఆంధ్ర విశ్వవిద్యాలయానికి న్యాక్‌ ఏ డబుల్‌ ప్లస్‌ గ్రేడ్‌ ప్రకటించింది. ఈనెల మొదటి వారంలో ఏడుగురు సభ్యుల గల న్యాక్‌ బృందం ఏయూలో పర్యటించింది. ఈ మేరకు వారం వ్యవధిలోనే గ్రేడ్‌ను ప్రకటించింది.  2005 నుంచి న్యాక్‌ దేశంలో వివిధ విద్యా సంస్థల గ్రేడ్‌ను ప్రకటిస్తూ వస్తోంది. చివరిసారిగా 2016లో ప్రకటించింది. మధ్యలో కొవిడ్‌ కారణంగా రెండేళ్లు ప్రకటించలేదు. ఈ గ్రేడింగ్‌ ఐదేళ్ల పాటు కొనసాగుతుంది. ఏ డబుల్ ప్లస్ కారణంగా  ఆంధ్రా యూనివర్సిటీకి అత్యంత ప్రతిష్టాత్మక గుర్తింపు లభించినట్లయింది.   98 సంవత్సరాల విశ్వవిద్యాలయం చరిత్రలో ఏ డబుల్‌ ప్లస్‌ గ్రేడ్‌ దక్కడం ఇదే తొలిసారి కావడం విశేషం. న్యాక్‌ ప్రమాణాలలో 3.74 శాతం సీజీపీఏతో దేశంలోనే అన్ని విశ్వవిద్యాలయాల కన్నా మొదటి స్థానంలో నిలిచిందన్నారు యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ పీవీజీడీ ప్రసాద్‌రెడ్డి. సాధారణంగా ఐదు సంవత్సరాలకే న్యాక్‌ గ్రేడింగ్‌ ఇస్తుంది. కానీ యూనివర్సిటీ ప్రమాణాలతో ఏడు సంవత్సరాలకు ఈ గ్రేడ్‌ లభించిందన్నారు. A++ ర్యాంక్‌ను నిలబెట్టుకోవడానికి చాలా కృషి చేయాల్సి ఉందన్నారు. పుస్తకాల్లోని పాఠాలు బోధించి, మార్కులతో కూడిన పట్టాని చేతిలో పెట్టి వ్యవస్థకు ఏయూ స్వస్తి చెబుతూ. యూనివర్సిటీ ఇటీవలి కాలంలో విద్యార్థి అభివృద్ధికి మార్గదర్శిగా. పరిశోధనలకు ప్రధాన కేంద్రంగా మారుతోంది. వివిధ దేశాలు, యూనివర్సిటీలు, సంస్థల ఒప్పందాలతో చదువుకు సహకారం అందిస్తూ.. ప్రతి విద్యార్థినీ ఉన్నతంగా తీర్చిదిద్దుతూ జాతీయ స్థాయిలో అత్యున్నత స్థానం పొందింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం 2002లో తొలిసారిగా 86.05 స్కోర్తో నాక్ ఏ గ్రేడ్ పొందిం ది. తరువాత 2008లో 3.64తో ఏ గ్రేడ్ ను 2016లో 3.6 స్కోర్ తో మరోసారి ఏ గ్రేడ్ ను సాధించింది. తాజాగా జాతీయ స్థాయిలో అత్యుత్తమంగా ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్ ను పొందింది.    విశ్వవిద్యాలయాల్లో ఎన్నడూ లేని విధం గా స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్లు నెలకొల్పడం, చైర్ ప్రొఫెసర్లని ఏర్పాటు చేయడం తదితర మార్పులు చేశారు. దేశంలో విద్యాలయాన్ని ఉన్నత స్థానంలో నిలబెట్టాయి. విశ్వవిద్యాలయం. ఏ డబుల్ ప్లస్ గ్రేడ్ సాధించి, దేశంలో ఉన్నత స్థానాన్ని పొందడంపై వీసీ ప్రొఫెసర్ ప్రసాదరెడ్డి, రిజిస్ట్రార్ జేమ్స్ స్టీఫెన్, రెక్టార్లు, ప్రొఫెసర్లు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.    

Related Posts