YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మిర్యాలగూడ టిఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు ఇంట్లో గురువారం ఐటీ సోదాలు

మిర్యాలగూడ టిఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు ఇంట్లో గురువారం ఐటీ సోదాలు

మిర్యాలగూడ
మిర్యాలగూడ టిఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కర రావు ఇంట్లో గురువారం ఐటీ సోదాలు ప్రారంభమయ్యాయి. మిర్యాలగూడ, హైదరాబాద్లో ఏకకాలంలో ఐటీ తనిఖీలు జరుగుతున్నాయి.
మరోవైపు, భాస్కరరావు ముఖ్య అనుచరుడు, కాంట్రాక్టర్ వింజం శ్రీధర్ నివాసంపై కుడా  ఐటి అధికారులు  దాడులు జరిపారు. మిర్యాలగూడ పట్టణంలోని వైదేహి టౌన్ షిప్ లో ఉన్న అయన నివాసంలో  తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఐటీ తనిఖీలు జరుగుతున్నాయి. 40 బృందాలతో హైదరాబాద్ లో పలు కార్యాలయాలు, తెలంగాణ వ్యాప్తంగా, అలాగే,  దేశ వ్యాప్తంగా పవర్ ప్లాంట్స్ బిజినెస్ సంస్థలపై దాడులు జరుగుతున్నట్లు సమాచారం. ఎన్నికల కోసం భారీ గా డబ్బులు నిల్వ ఉంచినట్లు ఆరోపణలు వచ్చిన నేపధ్యంలో్ ఈ తనిఖీలు జరుగుతున్నాయి.

Related Posts