YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మార్కెట్ లో పొంగులేటి ప్రచారం

మార్కెట్ లో పొంగులేటి ప్రచారం

ఖమ్మం
దొరల పరిపాలనకు దోపిడీ పరిపాలనకు ఇందిరమ్మ రాజ్యానికి జరుగుతున్న పోరాటం ఈ పోరాటం. ఈ పోరాటంలో దోపిడీ పరిపాలన కావాలా ఇందిరమ్మ రాజ్యం కావాలా మీరు ఒకసారి ఆలోచించుకోండి. ప్రతి ఒక్కరి గుండెల్లో ఇప్పటికీ ఇందిరమ్మనే ఉంది అని పాలేరు కాంగ్రెస్ అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.
ఖమ్మం నగరంలోని హోల్ సేల్ కూరగాయ మార్కెట్లో ప్రచారం నిరచించిన పొంగులేటి శ్రీనివాస రెడ్డి కి గుమ్మడి కాయతో దిష్టి తీసి అడుగడుగునా పూలు చల్లుతూ స్వాగతం పలికిన మార్కెట్ వ్యాపారులు.
స్థానిక అధికార పార్టీ అభ్యర్ధి నోరు తెరిస్తే అబద్ధాలే.. ఖమ్మం లో అభివృద్ధి మొత్తం నేనే చేశాను అని చెప్పుకుంటున్నారు ఇంకా నయం నాగార్జున సాగర్ కాలువ కూడా నేనే తీశాను అని చెప్పుకోలేదు అంటూ పువ్వాడ పై ఘాటు వ్యాఖ్యలు పొంగులేటి  చేసారు. రెండు సార్లు అధికారం లో ఉన్న కల్వకుంట్ల కుటుంబం అరా కొరా డబుల్ బెడ్ రూం లు ఇచ్చి మేము డబుల్ బెడ్ రూం లు ఇచ్చాం అని చెప్పుకుంటున్నారు. ఏ ఒక్క నిరుద్యోగికి కూడా ఉద్యోగాలు రాలేదు కానీ కల్వకుంట్ల కుటుంబానికి ఆరు ఉద్యోగాలు వచ్చయంటూ కేసీఆర్ పై విరుచుకు పడ్డారు.

Related Posts