నంద్యాల
పట్టణ తెలుగుదేశం పార్టీ రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. నంద్యాల పట్టణంలో ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ సీటు గురించే చర్చ జరుగుతున్నట్టు సమాచారం. ఎన్నికలు సమీపిస్తున్న వేళ నంద్యాల అసెంబ్లీ సీటు ఎవరికి ఇస్తారు అనే సందిగ్ధంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తుంది. అత్యంత విశ్వచనీయ సమాచారం ప్రకారం రాష్ట్రంలో మైనారిటీలను దృష్టిలో ఉంచుకొని తెలుగుదేశం పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఐదు సీట్లు ముస్లింలకు కేటాయించాలని చంద్రబాబు నాయుడు చర్చిస్తున్నట్టు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా ముస్లింలు అధికంగా ఉన్న అసెంబ్లీ స్థానాలలో నంద్యాల, కడప, ఆదోని, కర్నూలు, బద్వేలు ఇంకా కొన్ని అసెంబ్లీ నియోజకవర్గస్థానాలు ఉన్నాయి. ముస్లింలు అధికంగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లోని అభ్యర్థులు తమ సీటు ఎక్కడ పోతుందోనని నంద్యాల సీటును మైనార్టీ వర్గానికి కేటాయిస్తే ఒక సీటులో మేము బయటపడచ్చని చంద్రబాబు నాయుడు దగ్గర ఫరూక్ పేరు ప్రస్తావించినట్టు సమాచారం. నంద్యాల పట్టణంలో అత్యధిక ఓటు బ్యాంకు కలిగిన సామాజిక వర్గాలలో బలిజ సామాజిక వర్గం కూడా ఉంది.
ఫరూక్, బ్రహ్మానంద రెడ్డికి కాకుండా బలిజ కులస్తుల్లో ఉన్న బలమైన నాయకుడు కోసం అన్వేషణ ప్రారంభమైనట్టు విశ్వసినీయవర్గాల సమాచారం. ఒకవేళ అదే జరిగితే నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో సంచలనాలు నమోదు అయ్యే అవకాశం కనిపిస్తోంది. 2014 ఎలక్షన్ అయిపోయిన నాటి నుంచి భూమా బ్రహ్మానందరెడ్డి ఏదో ఒక కార్యక్రమ రూపంలో నియోజకవర్గంలోని రూరల్ ప్రాంతాలు, నంద్యాల పట్టణంలో విడతలవారీగా ప్రజలను కలుస్తూనే ఉన్నారని భూమా బ్రహ్మానంద రెడ్డి కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. గత కొన్ని రోజుల క్రితం భూమా బ్రహ్మానంద రెడ్డి ముఖ్య అనుచరులు తెలుగుదేశం పార్టీలోని ముఖ్య నాయకులతో సమాలోచనలు జరిగినట్టు సమాచారం. ఈ చర్చలలో ఫరూక్ నీ ఎం.పీ స్థానానికి పంపించి బ్రహ్మానందరెడ్డి కి నంద్యాల అసెంబ్లీ సీటు కేటాయించాలని చర్చించినట్లు సమాచారం. ఒకవేళ భూమా బ్రహ్మానంద రెడ్డికి నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ సీటు కేటాయించకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని కార్యకర్తల సమావేశంలో చెప్పినట్లు సమాచారం. నంద్యాల అసెంబ్లీ సీటు చివరికి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంసంగా మారిందని నంద్యాల పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు. బలమైన బలిజ కులస్తులకు చెందిన నాయకుడు కోసం అన్వేషణ ప్రారంభించినట్టు అత్యంత విశ్వచనీయ సమాచారం. ఒకవేళ భూమా బ్రహ్మానందరెడ్డి ఇండిపెండెంట్గా నిలబడితే లాభపడేది ఎవరో నష్టపోయేది ఎవరో కాలమే నిర్ణయించాలి.