YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

పశు సంక్షేమానికి నిధుల కొరత లేదు : మంత్రి తలసాని

పశు సంక్షేమానికి నిధుల కొరత లేదు : మంత్రి తలసాని

గతంలో ఎన్నడూ లేని విధంగా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక ఆలోచనతో  అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.  సోమవారం అయన పశుసంవర్ధక శాఖ అధికారులతో సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ పశు వైద్య శాలల భవనాలకు  అవసరమైన మరమ్మత్తులు, పరికరాల కోసం 10 రోజులలో ప్రతిపాదనలు పంపించండి. నిధులకు కొరత లేదన్నారు. ఆర్ ఐ డీ ఎఫ్  క్రింద చేపట్టిన పనులు పెండింగ్ ఉంటే ప్రతిపాదనలు పంపిస్తే వెంటనే నిధులు మంజూరు చేయడం  జరుగుతుంది. నూతన జిల్లా కేంద్రాలలో  మందులు, దాణా నిల్వ చేసేందుకు గోదాముల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాలి. నూతన పశువైద్యశాలల భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపిస్తే ప్రాధాన్యత క్రమంలో నిధులు పంపించడం జరుగుతుందని అన్నారు. ఇప్పటికే 5 వేల కోట్ల రూపాయల ఖర్చుతో గొర్రెల పంపిణీ కార్యక్రమం విజయవంతం గా కొనసాగుతుంది. వేసవిలో దాణా కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకున్న కారణంగా ఎక్కడ దాణా ఇబ్బందులు ఏర్పడలేదు. జీవాల వద్దకే  వైద్యం తీసుకెళ్లాలి అనే ఉద్దేశ్యంతో  100 సంచార పశు వైద్యశాలలను ప్రారంభించి సేవలు అందించడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు సక్రమంగా అమలు జరిగేలా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిన అవసరం ఉంది. సంచార పశు వైద్య శాలల సేవలు సక్రమంగా అందుతున్నాయా, మందుల కొరత ఉందా అనే విషయాలపై  ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పశుసంవర్ధక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, డైరెక్టర్ వెంకటేశ్వర్లు, గొర్రెల అభివృద్ధి సమాఖ్య ఎండీ లక్ష్మారెడ్డి, పంచాయతీ రాజ్ సీఈ  జాన్ మిట్టల్ పాల్గోన్నారు. 

Related Posts