విజయవాడ
ఏపీకి సంబంధం లేని అధికారికి టీటీడీ ఫుల్ ఎడిషనల్ చార్జ్ అప్పగించారు. ధర్మారెడ్డి టీటీడీ ఈవోగా అర్హుడా. టీటీడీ లాంటి పెద్ద సంస్థకు సీనియర్ ఐఏఎస్ అధికారులు ఇప్పటివరకు ఈవోలుగా చేశారు. ఐఏఎస్ అధికారులు ఉండాల్సిన చోట ధర్మారెడ్డి లాంటి వ్యక్తిని నియమిస్తే ఐఏఎస్ సంఘాలు ఎందుకు ప్రశ్నించడం లేదని టిడిపి అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. ఐఏఎస్అసోసియేషన్లు ప్రశ్నించడానికి భయపడుతున్నాయా. ధర్మారెడ్డి పై ఢిల్లీ కంటోన్మెంట్ బోర్డులో లంచం డిమాండ్ చేశారు అనే ఆరోపణపై 14 సెక్షన్ల కింద కోర్టులో కేసు నమోదు చేశారు. ధర్మారెడ్డికి సమన్లు ఇవ్వమని కోర్టు ఆదేశించింది. తనపై ఈ కేసు ఉందని ధర్మారెడ్డి ప్రభుత్వానికి తెలియజేశారా. తక్షణమే ధర్మారెడ్డిని సస్పెండ్ చేయాలి. తిరుపతిలో కరుణాకర్ రెడ్డిని 10% కరుణాకర్ రెడ్డి అని పిలుస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో టీటీడీ నెంబర్ కావాలంటే కోటీశ్వరులు అయినా అయి ఉండాలి లేదా గజదొంగ అయినా అయి ఉండాలి లేదా స్కాములు చేసైనా ఉండాలి అని అనుకుంటున్నారని అన్నారు.