విశాఖపట్నం
నేను విశాఖ ఎంపిగా ఎన్నికైతే, అనేక ప్రయోజనాలు ఉంటాయని అన్ని పార్టీలు భావించడం సంతోషం. విశాఖ లోక్ సభ సభ్యులు ఉన్న ఎం వి వీ సత్యనారాయణ మళ్లీ ఎంపిగా పోటీ చేయనని మొదట సపోర్ట్ ఇవ్వడం సంతోషమని ప్రజా శాంతి పార్టీ అధినేత కే ఏ పాల్ అన్నారు.
టీడీపీ అభ్యర్థి భరత్ కూడా పాల్ విశాఖ ఎంపి అయితే బాగుంటుందని తన అనుచరులకు చెప్తున్నాడు.
జే డీ లక్ష్మి నారాయణ నన్ను విశాఖ అభ్యర్ధిగా గెలిపించడానికి తన కోసం ప్రచారం చేస్తానని హామీ ఇచ్చారు. బీజేపీ అభ్యర్ధిగా ఊహించుకుంటున్న జీ వీ ఎల్ కు అసలు పోటీ చేస్తాడో? లేదో? ఆయనకే తెలీదు. బీజేపీ స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, రైల్వే జోన్ ఏ హామీ నెరవేర్చని బీజేపీ కి ఎవడు ఓట్లేస్తారు? బీ సీ లను పక్కన పెట్టీ జీ వీ ఎల్ లాంటి బ్రాహ్మణుడిని బీజేపీ ఎలా ప్రోత్సహిస్తుంది? జీ వీ ఎల్ తక్షణమే విశాఖ నుంచి వెళ్లి పోవాలి. పార్లమెంట్ లో మోడీని ఎదుర్కునే సత్తా నాకు తప్ప ఎవ్వరికీ లేదని వ్యాఖ్యానించారు. విశాఖ వాసులు సహృదయంతో అర్దం చేసుకుని పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించండని అన్నారు.