YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సుబ్బరామిరెడ్డి కంపెనీలు దివాళా...?

సుబ్బరామిరెడ్డి కంపెనీలు దివాళా...?

విశాఖపట్టణం, నవంబర్ 17,
టి.సుబ్బిరామిరెడ్డి.. తెలుగు నాట పరిచయం అక్కర్లేని పేరు. జాతీయ స్థాయిలో సైతం సినీ, రాజకీయ రంగాల్లో ఆయనది ప్రత్యేక స్థానం.ఆయన పొలిటికల్, సినీ సెలబ్రిటీలకు ఇచ్చే పార్టీలు అత్యంత ఖరీదైనవి. విశాఖ బీచ్ లో శివలింగాలతో చేసే అర్చనలు ఓ రేంజ్ లో ఉండేవి. అంతటి దర్పం కలిగిన సుబ్బిరామిరెడ్డి అనూహ్యంగా కింద పడిపోయారు. ఆర్థికంగా చితికిపోయినట్లు కథనాలు వస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.అప్పటికి,ఇప్పటికీ కాంగ్రెస్ లో ఉన్న నేతల్లో సుబ్బిరామిరెడ్డి ఒకరు. గాంధీ కుటుంబంతో మంచి అనుబంధమే ఉంది. అదే చనువుతో రాజ్యసభ సభ్యుడిగా సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహించే అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఆపై కేంద్ర మంత్రిని కూడా చేసింది. స్వతహాగా పారిశ్రామికవేత్త అయిన సుబ్బిరామిరెడ్డిసేవా కార్యక్రమాల్లో సైతం ముందుండేవారు. సినీ రంగానికి దగ్గరగా గడిపేవారు. టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా అందరికీ సుపరిచితులు. సుబ్బిరామి రెడ్డికి సంబంధించి ఈవెంట్ అంటే దానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండేది. సెలబ్రిటీలు ఆసక్తి చూపేవారు. ఇక ఆయన నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు దేశవ్యాప్తంగా ఉన్న పేరు మోసిన స్వామీజీలు హాజరయ్యేవారు. అయితే అంతటి ఆర్థిక స్థితిమంతుడైన సుబ్బిరామిరెడ్డి.. ఇప్పుడు ఇబ్బందుల్లోకి వెళ్లారన్న వార్త ఆందోళన కలిగిస్తోంది.ప్రస్తుతం సుబ్బిరామిరెడ్డి కంపెనీలు దివాలా తీస్తున్నాయన్న వార్త తెలుగు నాట్ హల్ చల్ చేస్తోంది. ముఖ్యంగా ఆయన కుటుంబానికి చెందిన గాయత్రి ప్రాజెక్ట్స్ దాదాపు 6000 కోట్లకు దివాలా పిటిషన్ దాఖలు చేసింది. వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న 6000 కోట్లకు సంబంధించి రుణాలు చెల్లించడం లేదు. దీంతో బ్యాంకులు కంపెనీ లా ట్రిబ్యునల్ లో పిటిషన్ దాఖలు చేశాయి. గతంలో ఇదే అంశం తెరపైకి రాగా.. మొత్తం రుణాలు చెల్లించేందుకు గాయత్రి ప్రాజెక్ట్స్ సంస్థ అంగీకారం తెలిపింది. కానీ చెల్లింపులు మాత్రం చేయలేదు.బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్ లు అప్పులు ఇచ్చాయి. అయితే దీనికి గాను తనఖాగా పెట్టుకున్న షేర్లను బ్యాంకులు నష్టానికి అమ్ముకోవాల్సి వచ్చింది.అయితే సుబ్బిరామిరెడ్డి కంపెనీలు ఎంత దివాలా తీశాయో.. ఒక్క ఉదాహరణతో తేలిపోతుంది. దివాలా ప్రక్రియ ప్రారంభానికి ముందే కంపెనీ రోల్స్ రాయిస్, ఆస్టన్ మార్టిన్ లాంటి ఖరీదైన ఆరు లగ్జరీ కార్లను అమ్మేసినట్లు పత్రాలు సృష్టించడం విశేషం. అది కూడా తక్కువ ధరకే అమ్మినట్లు తెలుస్తోంది. ఇలా అమ్మిన కార్ల ద్వారా వచ్చిన సొమ్మును కూడా కంపెనీకి జమ చేయలేదు. దీంతో ఎన్సీఎల్టీఈకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనిపై దర్యాప్తునకు సదరు సంస్థ ఆదేశించింది.సుబ్బిరామిరెడ్డి కంపెనీలకు ఈ పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఈ కంపెనీల్లో సుబ్బిరామిరెడ్డి సతీమణి ఇందిరా రెడ్డి, కుమారుడు సందీప్ కుమార్ రెడ్డి కీలక స్థానాల్లో ఉన్నారు. దాదాపుగా 6000 కోట్లు నిరర్థక ఆస్తులుగా ఉన్నాయి. దివాలా ప్రక్రియ కొనసాగితే మాత్రం గాయత్రి ప్రాజెక్ట్స్ ఆస్తులన్నీ బ్యాంకర్లు స్వాధీనం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఎంత చరిత్ర కలిగిన సుబ్బిరామిరెడ్డికి ఈ పరిస్థితి రావడం ఏమిటని చాలామంది బాధపడుతున్నారు.

Related Posts