YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సంచలనం రేకేత్తిస్తున్న జనసేన

సంచలనం రేకేత్తిస్తున్న జనసేన

విజయవాడ, నవంబర్ 17,
ఏపీలో విద్యాసంక్షేమానికి పెద్దపీట వేసినట్లు వైసిపి సర్కార్ ఆర్భాటంగా ప్రకటించింది. నాడు నేడు, జగనన్న విద్యా కానుక కిట్లు, అమ్మ ఒడి, మధ్యాహ్న భోజన పథకం వంటి పథకాలతో విద్యాసంక్షేమానికి పాటుపడుతున్నట్లు వైసిపి నేతలు చెప్పుకుంటూ వస్తున్నారు. జనసేన అనుకున్నంత పని చేస్తోంది. వైసీపీ సర్కార్ అవినీతిని బయటపెడుతోంది. గణాంకాలు, రుజువులతో నిరూపిస్తోంది. దీంతో అధికార పార్టీ కలవరపాటుకు గురవుతోంది. గత నాలుగున్నర ఏళ్ల కాలంలో సంక్షేమ పథకాల మాటున జరిగిన అవినీతిని బయటకు తీసే పనిలో జనసేన పడింది. ఈ విషయాన్ని ముందే చెప్పి మరి వైసిపి సర్కార్ అవినీతిని జనసేన బయటపెడుతుండడం విశేషం.ఏపీలో విద్యాసంక్షేమానికి పెద్దపీట వేసినట్లు వైసిపి సర్కార్ ఆర్భాటంగా ప్రకటించింది. నాడు నేడు, జగనన్న విద్యా కానుక కిట్లు, అమ్మ ఒడి, మధ్యాహ్న భోజన పథకం వంటి పథకాలతో విద్యాసంక్షేమానికి పాటుపడుతున్నట్లు వైసిపి నేతలు చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే పథకాల మాటున పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని విపక్షాలు ఎప్పటినుంచో ఆరోపణలు చేస్తున్నాయి. కానీ కానీ ప్రభుత్వం పెద్దగా ఖాతరు చేసిన దాఖలాలు లేవు. ఈ తరుణంలో వైసీపీ సర్కార్ దోపిడిని రోజుకి ఒకటి బయట పెడతామని జనసేన ప్రకటించింది. ఆ ప్రకారం బయట పెడుతుండడంతో అధికార పార్టీలో కుదుపు ప్రారంభమైంది. గత రెండు రోజులుగా స్కాముల గురించి ఆధారాలతో సహా బయటపెట్టారు.ముందుగా పాఠశాల విద్యాశాఖలో జరుగుతున్న దోపిడీని బయటపెట్టారు. పిల్లల బూట్లు, బ్యాగు, డ్రెస్ క్లాత్ మెటీరియల్ పేరుతో రూ.120 కోట్ల అవినీతికి పాల్పడినట్లు జనసేన పి ఏ సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఢిల్లీలో ఈడి కొన్ని కంపెనీలపై దాడులు చేసినప్పుడు అక్కడి కాంట్రాక్టుల గుట్టు బయటపడిందని.. త్వరలో ఈడి ఇక్కడికి వస్తుందని సంచలన విషయం బయటపెట్టారు. ఇక ఇండోసోల్ కంపెనీ గురించి చెప్పనక్కర్లేదు. సదరు కంపెనీకి జగన్ సర్కార్ వేల ఎకరాలు కేటాయిస్తున్న వైనం వెనుక ఉన్న కథను జనసేన బయటపెట్టింది.అస్మదీయ కంపెనీల కోసం పారిశ్రామిక విధానాలను సైతం మార్చేశారు. ఈ భూములను నేరుగా సేల్ డిడ్ చేస్తున్నారు. అదంతా అస్మదీయ కంపెనీల కోసం రాయించుకోవడానికి నన్ను విమర్శలు ఎప్పటి నుంచి ఉన్నాయి. దీనిపై స్పష్టమైన ఆధారాలతో జనసేన బయట పెడుతుండడం విశేషం. ప్రభుత్వం మారగానే వీటన్నింటిపై పక్కాగా కేసులు నమోదు చేస్తామని… అధికారుల నుంచి సీఎం జగన్ వరకు ఎవరిని వదిలి ప్రసక్తి లేదని జనసేన చెబుతుండడం అధికార పార్టీలో ఒక రకమైన కలవరం ప్రారంభమైంది. మరో నాలుగు నెలల్లో ఏపీలో అసలు సినిమా ప్రారంభమయ్యే సూచనలు మాత్రం కనిపిస్తున్నాయి. ప్రస్తుతం విపక్ష నేతలపై జగన్ సర్కార్ అక్రమ కేసులు నమోదు చేస్తున్న నేపథ్యంలో.. జనసేన వైసిపి అవినీతిని బయటపెడుతుండడం వైసిపి నేతల్లో ఒక రకమైన భయాందోళన నెలకొంది.

Related Posts