YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

*నాగుల చవితి గురించి..

*నాగుల చవితి గురించి..
ఈ రోజున సూర్యోదయానికిముందు గా ఆకాశంలో తూర్పుదిక్కులో శేషు ని నక్షత్ర రూపం దర్శనం ఇస్తుంది. వారి, వంశాచారాన్ నిఅనుసరించి, నాగేంద్రుని ఉద్దేశించి పుట్టలో పాలుపో సి, చలిమిడి,వడపప్పు,నువ్వులతో చేసిన,చిమ్మిలి,తీపి పదార్థాలు మొ దలైనవి నైవేద్యంగా సమర్పిస్తారు.
ఈ రోజున గణపతి ఆరాధన సుబ్ర హ్మణ్య ఆరాధన కూడా ఫలితాలని స్తాయి. పెండ్లి కానీ వారు, పిల్లలు క లుగని వారు,నాగ దోషంఉన్నవారు, ఇతర దోషాలు ఉన్నవారు నాగ దేవ త ఆరాధన మేలు చేస్తుంది.ఆశ్లేష, ఆరుద్ర,మూల,పూర్వాభాద్ర, పూర్వాషాడ అను ఈ ఐదు నక్షత్ర ములు సర్ప నక్షత్రమలు. సర్పము అనగా! కదిలేది, పాకేది.
నాగములో *‘న, అగ’* ఎప్పుడూ కదులుతూ ఉండేదని అర్థం. క్షణం కూడా ఆగకుండా అతివేగంగా వెళ్ళేదాన్ని *‘నాగము’* అంటారు. అన్నింటికంటే వేగంగా వెళ్ళేది *‘కా ల ము’* కావున నాగమునకు మరో అర్థం కాలం. అందుకే *‘కాలనాగ ము’* లేదా *‘కాలనాగు’* అని అం టారు. జ్యోతిష్యశాస్త్రానుసారం కాలసర్ప దోషం ఉన్నవారికి జీవన క్రమంలో ఎన్నో అవరోధాలు ఏర్పడుతాయి.జీవితం నిరంతరం కొనసాగే ప్రక్రియ అనగా! *‘నాగం’* సర్పము హృద య భాగంతో పాకుతూ ఉంటుంది. ఈ భాగాన్ని *‘ఉరా’* అంటారు కావున సర్పానికి *‘ఉరగము’* అ ని కూడ పేరు. ఉరమున ఉన్న మనస్సు చెప్పినట్టు నడిచే వాళ్ళమైన మనమూ *‘ఉర గముల’మే.* సర్పం తాను నిరంత రం సాగుతూ మన జీవనక్రమంలో ని వివాహం, జీవన ఘట్టాలను అవ రోధపరస్తుంది.కావున కార్తిక మాసంలో నాగులను ఆరాధిస్తారు. అగ్నిదేవతగా ఉండేది కార్తీకమాసములోనే.మన జీవనానికి కావాల్సిన ఉత్సా హం, ఉత్తేజం వంటివి తేజస్సు వల న అనగా సూర్యుడు, అగ్ని వలన కలుగుతాయి. శ్రీహరికి శయ్య, శంకరునికి ఆభరణ ము కూడా సర్పమే కావున నాగుల ను ఆరాధించడం వలన హరిహరు ల ను సేవించిన ఫలం దక్కుతుంది.
కార్తీక మాసమంతా ఇంట్లో నాగప్రతి మను ఆరాధిస్తూ, నాగస్తుతిని చేస్తే పరమాత్మ అనుగ్రహిస్తాడు. కార్తీకమాసం నెలరోజులుకాకపోయి నా కనీసం కార్తిక శుద్ధ చవితినాడు నాగులను ఆరాధించాలి.చవితి అంటే నాల్గవది అనగా!ధర్మా ర్థకామమోక్ష పురుషార్థాలలో నాల్గ వది మోక్షం కావున ఆనాడునాగుల ను ఆరాధిస్తే మోక్షము లభిస్తుంది.
అంటే! జీవితంలోవచ్చినకష్టాలనుం డి విముక్తులవుతాము. కావున నాగుల చవితినాడు దేవాల యాలలో, గృహములో లేదాపుట్టల వద్ద నాగ దేవతను ఆరాధించాలి.
*నాగులకు పాలు పోయడం లోని అంతరార్థం.పాలు స్వచ్ఛత కు ప్రతీక.*ఈ పాలనువేడిచేసి చల్లపరచి దాని కి కొద్దిగా చల్లనుచేరిస్తేపెరుగవుతుంది.ఆ పెరుగును చిలకగా వచ్చిన చల్ల లో నుంచి వచ్చే వెన్నను కాయగా నెయ్యి అవుతుంది.దీనిని మనం యజ్ఞంలో హవిస్సుగా ఉపయోగిస్తాం.అలాగే మన బ్రతుకనే పాలను జ్ఞాన మనే వేడితో కాచి వివేకమనే చల్ల క లిపితే సుఖమనే పెరుగుతయారవు తుంది. ఈ పెరుగును ఔదార్యమనే కవ్వంతో చిలకగా శాంతి అనే చల్ల లభిస్తుంది.ఆ చల్లను సత్యం, శివం, సుందరం అనే మూడు వేళ్ళతో కాస్త వంచి తీ స్తే సమాజ సహకారం అనే వెన్న బ యటకు వస్తుంది.ఆ వెన్నకు భగవంతుని ఆరాధన అ నే జ్ఞానాన్ని జోడిస్తేత్యాగము,యోగ ము, భోగమనే మూడు రకముల నె య్యి ఆవిర్భ విస్తుంది.ఇదే సకల వేదాలసారం,సకలజీవన సారంఅయినపాలనుజీవనమునకు ప్రతీక అయిననాగులకుఅర్పించడం లోని అంతరార్థం.*దేవా:- చక్షుషా పుంజానాః భక్తా న్‌ పాలయంతి.* అనేది ప్రమాణ వాక్యం,అనగా!దేవతలు ప్రసాదాన్ని చూపులతోనేఆరగి స్తారని అర్థం.
పాములు పాలుతాగవనేఅపోహతో పాలు పోయడంమానకుండాకొద్దిగా పాలను పుట్టలో పోసి మిగిలిన పా లను నైవేద్యంగా స్వీకరించాలి.
       *సర్వేషాంశాన్తిర్భవతు.*

Related Posts