మంగళగిరి
మంగళగిరిలోని వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ని నంద్యాల పట్టణానికి చెందిన కరుణామయ విద్య సంస్థల చైర్మన్, రాయలసీమ రీజియన్ ఆంధ్ర ప్రదేశ్ ప్రవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షులు దండే దస్తగిరి మర్యాదపూర్వకంగా కలిసి ప్రవేట్ పాఠశాల సమస్యల గురించి, రెన్యువల్ ఆఫ్ రికగ్నైజేషన్ మూడు సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల వరకు పెంచిన జీ.వోను తక్షణమే అమలు చేయాలని, అలాగే గత సంవత్సరము రికగ్నైజేషన్ కొరకు అప్లై చేసిన ప్రైవేట్ పాఠశాలలకు, అలాగే ఈ సంవత్సరం అప్లై చేసుకున్న ప్రైవేట్ పాఠశాలలకు 8 సంవత్సరాల తో కూడిన రికగ్నైజేషన్ పొడిగించాలని సంబంధిత అధికారులను తక్షణమే ఆదేశించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రైవేట్ పాఠశాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి సహాయ సహకారాలు అందించిన ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి గారికి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ (అప్స) ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ 18 జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు.