YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఖానాపురంలో భట్టి ప్రచారం

ఖానాపురంలో భట్టి  ప్రచారం

ఖమ్మం
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎన్నికల ప్రచారం ముదిగొండ మండలం ఖానాపురం లో జరిగింది. భట్టి విక్రమార్క ఎన్నికల ప్రచారానికి ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షులు రుద్రరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మశ్రీ, విజయవాడ సిటీ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు మద్దతు ప్రకటించారు. ఖానాపురం గ్రామంలో భట్టి ఎన్నికల ప్రచారానికి అపూర్వ స్పందన వచ్చింది. అడుగడుగునా మంగళహారతులు పట్టి మహిళలు  ఘనంగా స్వాగతం పలికారు. ఖానాపురంలో హోరేత్తిస్తున్న ప్రచార ర్యాలీ అగ్రభాగాన  మహిళల నృత్యాలు అలరించాయి. ఎన్నికల ప్రచారంలో మహిళలతో కలిసి భట్టి విక్రమార్క స్టెప్పులు వేసారు.
భట్టి విక్రమార్క మాట్లాడుతూ పదది సంవత్సరాలుగా ప్రజలకు అందుబాటులో లేని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు. సెక్రటేరియట్ కు రాకుండా దేశంలో పనిచేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. కెసిఆర్ కు ప్రజలు ముఖ్యం కాదు.. ధరణి లాంటి కుంభకోణ పథకాలే ముఖ్యం. దశాబ్దాల తరబడి తెలంగాణ ప్రజలు నీళ్ల కోసం పోరాడితే... కాలేశ్వరం నిర్మాణం పేరిట ఆర్దిక దోపిడీ చేసింది బిఆర్ఎస్ పాలకులని అన్నారు.
బిఆర్ఎస్ నిర్మాణం చేసిన మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ప్రాజెక్టులు పనికిరాని పునర్మించాలని వాస్తవాలు  డ్యామ్ సేఫ్టీ అధికారులు బయటపెట్టారు. కాలేశ్వరం ప్లాను ప్రకారం చేసిన డిజైన్ ప్రకారం నిర్మాణం జరగలేదు. కాలేశ్వరం మిషన్ భగీరథ పేరిట 1,60,000 కోట్లు దోపిడీ చేసిన బిఆర్ఎస్ ప్రభుత్వం. అలంకారప్రాయంగా మిషన్ భగీరథ ట్యాంకులు పైపులుమారాయి. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసిన ఏ గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లను చూడలేదు. ప్రజా సంపదను లూటీ చేసిన బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాలేశ్వరంలో ముంచుదాం, దంచుదాం, దించుదామని సునామీల ప్రజల తిరుగుబాటు మొదలైందని అన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభంజనం వీస్తుంది, వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే
కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటులో మధిర నియోజకవర్గం ప్రధాన భూమిక పోషిస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఖమ్మం ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు విరివిగా తెస్తామని అన్నారు.
కాంగ్రెసులో చేరికలు
బిఆర్ఎస్  మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు పసుపులేటి నాసరయ్య, నాయకులు రాజయ్య కొత్తపల్లి రాణి బ్రహ్మం శ్రీను వల్లాల వెంకటేష్ తదితరుల ఆధ్వర్యంలో సుమారు వందమంది కార్యకర్తలు చెప్పు వారి వాటికి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. వీరికి కాంగ్రెస్ కండువాలు కప్పి భట్టి విక్రమార్క సాదరంగా ఆహ్వానించారు

Related Posts