YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కేసులతో ప్రతిపక్షా ఉక్కిరిబిక్కిరి

కేసులతో ప్రతిపక్షా ఉక్కిరిబిక్కిరి

విజయవాడ, నవంబర్ 20,
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రెండు నెలల కిందటితో పోలిస్తే..  ఇప్పుడు మౌలికమైన మార్పులు వచ్చాయి. అదేమిటంటే.. రెండు నెలల కిందట ఎటు వైపు చూసినా టీడీపీ నేతల కార్యక్రమాలు కనిపించేవి. అప్పుడు వైఎస్ఆర్‌సీపీ నేతల హడావుడి పెద్దగా ఉండేది కాదు.  కానీ ఇప్పుడు ప్రతిపక్ష నేతలు తమ కార్యాచరణ అమలు చేయడానికి  ఇంకా క్లారిటీ కోసం చూస్తున్నారు. అయితే అధికార పార్టీ మాత్రం వరుస కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తోంది. వాటికి ఆదరణ ఎలా  ఉందన్న సంగతిని పక్కన పెడితే.. మొదట సామాజిక సాధికార బస్సు యాత్రలు చేశారు. ఇప్పుడు వై ఏపీ నీడ్స్ జగన్ పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇది పేరుకు  ప్రభుత్వ కార్యక్రమం కానీ.. అసలు మాత్రం వైసీపీ కార్యక్రమమే. రాజమండ్రిలో నిర్వహించిన మహానాడును సూపర్ సక్సెస్ చేసుకున్న టీడీపీ అక్కడే మినీ మేనిఫెస్టోను ప్రకటిచింది. ఆరు ప్రజాకర్షక హామీలను ఇచ్చి.. గ్యారంటీ పేరుతో ప్రజల్లోకి వెళ్లడం ప్రారంభించింది. చంద్రబాబునాయుడు  ప్రాజెక్టుల ఆలస్యానికి వ్యతిరేకంగా యుద్ధ భేరీ అని.. భవిష్యత్ కు గ్యారంటీ అని పలు రకాల కార్యక్రమాలతో క్రమంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. అదే సమయంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అని ఓ విడత ప్రచారం చేశారు. పార్టీ నేతలకూ అసైన్ మెంట్ ఇచ్చారు. పార్టీ నేతలంతా ప్రజల్లోకి వెళ్తున్నారు. మరో వైపు నారా లోకేష్ పాదయాత్ర సాగుతోంది. కుప్పంలో ప్రారంభమైన యాత్ర.. ఓ చరిత్ర సృష్టించే దిశగా సాగుతోందన్న అభిప్రాయం టీడీపీ క్యాడర్ లో ఏర్పడింది.  ఇలా టీడీపీ పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్తున్న సమయంలో రాజకీయ పర్యటనలో ఉన్న సమయంలోనే  చంద్రబాబును కర్నూలులో సీఐడీ పోలీసులు అరెస్టు్ చేశారు. ఇప్పటికీ ఆయన మధ్యంతర బెయిల్ పై ఉన్నారు. పూర్తి స్థాయి బెయిల్ రాలేదు. మరో వైపు వరుసగా ఆరు కేసులు నమోదు చేశారు. సుప్రీంకోర్టులో 17ఏ కేసు సానుకూలంగా వస్తే తప్ప చంద్రబాబుకు రిలీఫ్ లభించదు. వ్యతిరేకంగా వస్తే ఎన్ని కేసులు పెడితే అన్ని కేసుల్లో బెయిల్ కోసం ప్రయత్నించాలి. కానీ చంద్రబాబు ఎన్నికల సన్నాహాలు దెబ్బతీయడానికి ఎన్ని కేసులైనా పెట్టి అరెస్టులు చేస్తూనే ఉంటారన్న ప్రచారమూ జరుగుతోంది.  మరో వైపు చంద్రబాబు అరెస్టు పరిణామాల వరకూ వైఎస్ఆర్‌సీపీ పెద్దగా ప్రోగ్రామ్స్ పెట్టుకోలేదు. సీఎం జగన్ పథకాల బటన్లు నొక్కేందుకు జిల్లాలకు  వెళ్లినప్పుడు ఎన్నికల ప్రచారం తరహాలో ప్రసంగాలు చేయడం, గడప గడపకూ మన ప్రభుత్వం పేరుతో ఎమ్మెల్యేలు, ఇంచార్జులు చేసే పర్యటనలు మినహా పెద్దగా కార్యక్రమాలు లేవు. చంద్రబాబు అరెస్టు తర్వాత  టీడీపీ ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాలు బ్రేక్ పడటంతో వైసీపీ అందుకుంది. బస్సు యాత్రలు.. వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాలను ప్రకటించి అమలు చేస్తోంది. ఇంటింటికివెళ్తోంది. మరో వైపు సీఎం జగన్ వివిధ అబివృద్ధి పనుల పేరుతో నియోజకవర్గాల పర్యటనలకు వెళ్తున్నారు. యితే టీడీపీని కట్టడి చేయడానికి వారి ఎన్నికల సన్నాహాలు దెబ్బతీయడానికి వైసీపీ పన్నిన వ్యూహం టీడీపీకి  మేలు చేసిందనే అభిప్రాయం ఎక్కువగా నిపిస్తోంది. ఏ రాజకీయ పార్టీకైనా కావాల్సింది ప్రచారం. చంద్రబాబును అరెస్టు చేసినప్పటి నుండి ప్రపంచంలో తెలుగు వారు ఉన్న ప్రతి దేశంలోనూ ఆయనకు మద్దతుగా ప్రదర్శనలు జరిగాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు, చెన్నైల్లోనూ ప్రదర్శనలు జరిగాయి. యాభై రెండు రోజుల పాటు వీటిని కొనసాగిస్తూనే ఉన్నారు. చివరికి తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేయడం లేదని ప్రకటించిన తర్వాత కూడా గచ్చిబౌలి స్టేడియంలో సీబీఎన్ గ్రాటిట్యూడ్ కాన్సర్ట్ నిర్వహించారు.  నిజానికి చంద్రబాబు బయట ఉంటే.. సైబరాబాద్ ను నిర్మించానని పదే పదే చెప్పుకునేవారు. కానీ ఆయన జైల్లో ఉండటం వల్ల .. ఇలాంటి ప్రచారం ఐటీ ఉద్యోగులు చేశారు. చంద్రబాబు చేసిన మంచి పనులన్నీ ప్రజలకు తెలిసేలా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మధ్యంతర బెయిల్ వచ్చిన తర్వాత ఉండవల్లి నివాసానికి వెళ్లే ప్రతీ చోటా.. ప్రజలు పెద్ద ఎత్తున గుమికూడి స్వాగతం పలికారు. దీంతో చంద్రబాబు కాన్వాయ్ చాలా నెమ్మదిగా సాగింది. ప్రజా స్పందన చూసి టీడీపీ నేతలు సంతోషపడ్డారు. చంద్రబాబు అరెస్ట్ వల్ల టీడీపీకి మేలే జరిగిందని టీడీపీ వర్గాలు ఓ అంచనాకు వస్తున్నాయి. మరో నాలుగు నెలల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తున్న సమయంలో టీడీపీకి మరింత మేలు చేసేలా పరిస్థితులు ఉన్నాయని టీడీపీ ఓ అంచనాకు వచ్చింది. వైసీపీలోనూ అదే అభిప్రాయం ఉంది. అందుకే సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎన్నికలకు ముందు సింపతీ వచ్చేలా ఎందుకు అరెస్టులు చేస్తామని ప్రశ్నిస్తున్నారు. ఆయన ఉద్దేశం తమ ప్రమేయం లేకుండా అరెస్టు జరిగిందని చెప్పడమే. కానీ ప్రజలు ఎలా నమ్మగలరు ?3 ఏళ్ల చంద్రబాబును ఎదుర్కోలేక తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారని ఆయనను  జైల్లోనే ఉంచి.. ఎన్నికలకు వెళ్లాలనుకున్నారని టీడీపీ విస్తృత ప్రచారం చేసింది. చంద్రబాబు సతీమణి నిజం గెలవాలి పేరుతో ప్రజల్లోకి వెళ్లారు  ఈ మధ్య కాలంలో వైసీపీ మంత్రులు చేసిన వివాదాస్పద ప్రకటనలు, చంద్రబాబు మరణం, భువనేశ్వరి అరెస్టు అంటూ చేసిన ప్రకటనలను ప్రజల్లోకి తీసుకెళ్లి సానుభూతిని పెంచుకునేందుకు ప్రయత్నించారు.  చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో పదేళ్లు సీఎంగా ఉన్నారు. ఇప్పటికే తెలంగాణలో ఆయన అధికారంలో లేక ఇరవై ఏళ్లు అయినా చంద్రబాబు ముద్ర కనిపించేలా చేసుకోగలిగారు. ఇదే విషయాన్ని బలంగా యువ ఓటర్ల దృష్టిలోకి తీసుకెళ్లగలిగారని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇవన్నీ కలిపి చంద్రబాబుకు సానుభూతి వచ్చిందని చెబుతున్నారు. టీడీపీ ప్రజల్లోకి వెళ్తున్న సమయంలో అరెస్టు ఎపిసోడ్ వచ్చింది. నిజానికి చంద్రబాబు పర్యటనలు, పవన్ యాత్ర... లోకేష్ యువగళం అన్నీ జరిగినా పూర్తిగా అది రాజకీయ పోరాటం అయ్యేది. ప్రజలు బేరీజు  వేసుకుని ఎవరికి ఓటు వేయాలో డిసైడ్ చేసుకుంటారు. కానీ ఇక్కడ రాజకీయాలకు అతీతంగా ఇంకేదో జరిగింది. అది ఓటింగ్ ప్రయారిటీలోకి వస్తోంది. అక్కడే వైసీపీ వ్యూహాత్మక తప్పిదం చేసిందన్న అభిప్రాయం వినిపించడానికి కారణం అవుతోంది.

Related Posts