YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో బీజేపీ తటస్థ ప్లాన్... కూటమి దూరం...

ఏపీలో బీజేపీ తటస్థ ప్లాన్... కూటమి దూరం...

విజయవాడ, నవంబర్ 20,
స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసు సిబిఐకి అప్పగించనున్నారా? దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సమ్మతం తెలిపిందా? లేకుంటే కేంద్రమే ఆదేశించిందా? చంద్రబాబును సేవ్ చేసేందుకా? లేక కేసును మరింత బిగించి చంద్రబాబును అచేతనం చేయడానికా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. స్కిల్ స్కాం కేసును సిపిఐ కి అప్పగించాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హైకోర్టులో పిటీషన్ వేయగా.. రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. దీంతో ఈ కేసు త్వరలో సిబిఐకి అప్పగిస్తారు అన్న ప్రచారం జరుగుతోంది.స్కిల్ కేసులో చంద్రబాబు ఫారెస్ట్ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. సీఎం జగన్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని.. దీని వెనుక కేంద్ర పెద్దల హస్తం ఉందనే ప్రచారం జరిగింది. ఈ పరిణామంతో అధికార పార్టీకి కొంత డ్యామేజ్ జరిగిన మాట వాస్తవం. కనీసం ఇందులో రాజకీయ కక్ష లేదని వైసీపీ చెప్పుకోవడానికి సిబిఐకి కేసు అప్పగిస్తారని ఒక టాక్ నడుస్తోంది. మరోవైపు ఢిల్లీ అగ్రనేతల సంకేతాలతోనే జగన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది అనేది రాజకీయ వర్గాల్లో మరో ప్రచారం గా ఉంది. చంద్రబాబును మరింత ఒత్తిడికి గురి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకొని ఉంటారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.వాస్తవానికి తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బిజెపికి బే షరతుగా మద్దతు ప్రకటిస్తుందని కాషాయ దళం భావించింది. కానీ అటువంటిదేమీ జరగలేదు. పైగా టిడిపి శ్రేణులు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. అటు సెటిలర్స్ సైతం బిజెపి, బిఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. దీనిని గ్రహించిన బిజెపి జనసేన ను తన వైపు తిప్పుకుంది. ఇటువంటి తరుణంలో చంద్రబాబును తన కొనుసన్నలో పెట్టుకోవాలని బిజెపి భావిస్తోంది. అందుకే స్కిల్ కామ్ కేసును సిబిఐకి బదలాయించే ఎత్తుగడ వేస్తోందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల ముగిసిన తర్వాతనే ఏపీలో బిజెపి గేమ్ ప్లాన్ ఒక కొలిక్కి రావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.వచ్చే ఎన్నికల్లో ఏపీలో బిజెపితో కలిసి ఎన్నికలకు వెళ్తే టిడిపికి తీవ్ర నష్టమని సర్వేలు చెబుతున్నాయి. అందుకే బిజెపితో కలిసి నడిచేందుకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు సైతం తప్పుపడుతున్నాయి. చంద్రబాబు సైతం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇదే విషయాన్ని తెలుగుదేశం పార్టీ బిజెపికి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఏపీలో బిజెపి తటస్థంగా ఉండాలని.. టిడిపి, జనసేన కలిసి పోటీ చేస్తాయని.. అధికారంలోకి వచ్చిన వెంటనే బిజెపికి అనుకూలంగా వ్యవహరిస్తాయని ఒక ప్రతిపాదన బిజెపి వైపు వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఇది బిజెపి అగ్ర నేతలకు మింగుడు పడడం లేదు. అందుకే చంద్రబాబును తమ ఆధీనంలో ఉంచుకునేందుకు స్కిల్ స్కాం ను పావుగా వాడుకునేందుకు సిద్ధపడినట్లు సమాచారం. సిపిఐతో కట్టడి చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికల ఫలితాలు అనంతరమే దీనికి ఒక తుది రూపం రానుంది.

Related Posts