YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బీజేపీ తో నష్టమే జరిగింది : మహనాడులో చంద్రబాబు

బీజేపీ తో నష్టమే జరిగింది : మహనాడులో చంద్రబాబు

విజయవాడలో జరుగుతున్న మహానాడులో ఎన్టీఆర్ జయంతి వేడుకలు జరిగాయి. మహానాడులో సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా భారీ కేక్ కట్ చేసి పార్టీ నేతలకు తినిపించారు. ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే బాలకృష్ణ, పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తరువాత ముఖ్యమంత్రి మాట్లాడుతూ   రాజకీయాలను బీజేపీ పూర్తిగా కలుషితం చేసిందని మండిపడ్డారు.బీజేపీ వల్ల నష్టపోయాం తప్ప లాభపడింది లేదన్నారు.  కర్ణాటకలో అధికారం కోసం ఎమ్మెల్యేలతో బేరాలు ఆడుతూ దొరికిపోయిన వారు విలువల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీలోకి వెళ్లిపోయే నేతను అధ్యక్షుడిని చేసి మాట్లాడిస్తున్నారని అన్నారు. అమరావతి నిర్మాణానికి రూ.1500 కోట్లు ఇచ్చిన కేంద్రం గుజరాత్లో ఓ విగ్రహానికి మాత్రం రూ.3 వేల కోట్లు ఇచ్చిందన్నారు. ఢిల్లీ-ముంబై కారిడార్కు లక్ష కోట్ల రూపాయలు ఇచ్చిన కేంద్రం ఏపీ, తెలంగాణకు ఒక్క ప్రాజెక్టు కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం, మందబలం ఉందని రాష్ట్రాలను నియంత్రించాలనుకోవడం ఎల్లవేళలా కుదరని పని అని చంద్రబాబు తేల్చి చెప్పారు. తిరుమలలో వజ్రాలు మాయం అయ్యాయని ఆరోపించారని, అలాంటివి లేక పోయినా బురద చల్లే ప్రయత్నం చేశారని సీఎం కొందరు పదేపదే తప్పడు ప్రచారం చేస్తున్నారన్నారు. లేనిపోని అపోహలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూశారని ఆరోపించారు. రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో సంక్షోభం లేకుండా చేస్తున్నామన్నారు. ప్రతి కుటుంబం రూ.10వేలు ఆదాయం సంపాదించేలా కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. జన్మభూమికి సేవ చేసేందుకు అందరూ ముందుకురావాలన్నారు. ఆదాయాన్ని పెంచే మార్గాలు ఆలోచించాల్సిన అవసరం వుందని అన్నారు. 

Related Posts