YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ప్రతి రైతుకు బీమా

 ప్రతి రైతుకు బీమా

నవాబు పేట మార్కెట్ యార్డు కావాలని అడిగారు ప్రతిపాదనలు పంపండి.12 కోట్లతో చేవేళ్ల నియోజకవర్గం లో 20 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న మార్కెట్ గోదాములు నిర్మిస్తామని మంత్రి హరీష్ రావు అన్నారు. సోమవారం నాడు అయన నవాబ్ పేటలో 5000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న మార్కెట్  గోదామును ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ వచ్చే ఆగష్టు 15 వ తేదీ నుంచి పాస్ బుక్ ఉన్న ప్రతీ రైతుకు బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నాం. ఏ కారణంతో రైతు చనిపోయినా  ఐదు లక్షల రూపాయలు వారి కుటుంబ సభ్యలకప అందజేస్తామన్నారు. ముఖ్య మంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి. రైతులకు సాగు నీరు, ఉచిత విద్యత్, రైతు బంధు పథకం ద్వారా నాలుగు వేల పెట్టుబడి తాజాగా  రైతులకు ఐదులక్షల ఉచిత బీమా ఇస్తున్నామన్నారు. దేశంలోని ఏ సీఎం చేయని రీతిలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. రైతులు బ్యాంకుల వద్ద, అప్పుల వాళ్ల వద్ద నుంచి వడ్డీకి అప్పులు తెచ్చుకోవద్దనే రైతుబంధు పథకాన్నిసీఎం తెచ్చారని అన్నారు. పట్టా, ప్రభుత్వ, అటవీ భూములలో సాగు చేసే వారందరికీ నాలుగు వేల రూపాయలు అందిస్తాం.రైతులకు అనుమానాలువద్దు. ప్రతీ పంటకు, ప్రతీ ఏడాది నాలుగు వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. పార్టీ, కులం, మతం అనే తారతమ్ఆ లేకుండా కల్యాణ లక్ష్మి పథకం ద్వారా లక్ష రూపాయలు ఆడపిల్లల పెళ్లిక్ ప్రభుత్వం సాయం చేస్తోంది. గర్భిణీ స్త్రీ కి కేసీఆర్ కిట్ తే పాటు 12 _వేల రూపాయల సాయాన్ని అందిస్తున్నాం. పేదలకు ఉచిత కార్పోరేట్ వైద్యాన్ని ప్రభుత్వం అందిస్తోంది.పేదల దవఖానాను మార్చి ఆధునిక డయాలసిస్ కేంద్రాలు, ఐసీయూ సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోందని అన్నారు. రెండు వందల రూపాయల పెన్షన్ ను వేయికి ఏ ప్రభుత్వం పెంచలేదు. ఆ ఘనత కేసీఆర్ కే దక్కింది. వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు వేయి రూపాయల పెన్షన్ అందించి వారికి సీఎం భరోసా కల్పించారని అన్నారు.  చించల్ పేటలోను 643 మంది రైతులకు 80 లక్షల రూపాయలు రైతుబందు పథకం ద్వారా అందించామని వెల్లడిచారు. 

Related Posts