YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బి అర్ ఎస్, బి జె పి నాయకులు... హామీలు ఇస్తారు... మోసం చేస్తారు.

బి అర్ ఎస్, బి జె పి నాయకులు...  హామీలు ఇస్తారు... మోసం చేస్తారు.

హుజురాబాద్
టిఆర్ఎస్, బిజెపి ప్రభుత్వాలు హామీలు ఇచ్చుడు మోసం చేసుడు తప్పితే అభివృద్ధి చేసేది లేదని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వొడితల ప్రణవ్ అన్నారు. గురువారం కమలాపూర్ మండలంలోని మదన్నపేట, గునిపర్తి, శ్రీరాములపల్లి, అంబాల, నేరెళ్ల గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే భవిష్యత్తు బాగుంటుందని అన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజులకు హామీల అమలు చేస్తామని అన్నారు. టిఆర్ఎస్, బిజెపి నాయకులు కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేయాలని అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని పక్క రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, అక్కడ 500 రూపాయలకే వ్యా సిలిండర్, కర్ణాటక రాష్ట్రంలో 62 లక్షల మంది మహిళలు  ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదని హామీలన్నీ అమలు చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను కాపీ చేసి పింఛన్లు పెంచేస్తామని టిఆర్ఎస్ ప్రభుత్వం చెప్తుందని, ఉన్న పింఛన్లు సమయానికి ఇవ్వడం లేదు కానీ కొత్త పింఛన్లు ఇస్తామని హామీ ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. పదేళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయిందని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. యువకులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు సరైన వసతులు లేవని, తనను గెలిపిస్తే హుజురాబాద్ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో డిజిటల్ లైబ్రరీలతోపాటు స్టడీ సెంటర్లను ఏర్పాటు చేసి విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తానని హామీ ఇచ్చారు. వేయికోట్ల నిధులతో హుజురాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని మాటలు చెబుతున్నా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఎవరు ఆపారని అన్నారు. మండలానీకో ఇంటర్నేషనల్ స్థాయి పాఠశాల ఏర్పాటు చేసి కార్పొరేట్ స్థాయి విద్యానందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. రెండు దశాబ్దాలుగా ప్రజలు ఈటెల రాజేందర్ ను గెలిపిస్తూ వస్తున్నారని, ఈ నియోజకవర్గ ప్రజలను కాదని గజ్వేల్లో పోటీ చేస్తున్నారని తెలిపారు. గజ్వేల్ కు వెళ్లి గజ్వేల్ ముద్దుబిడ్డనని, హుజురాబాద్ కు వచ్చి హుజురాబాద్ బిడ్డనని చెప్తున్నాడని అన్నారు. ఏడుసార్లు అవకాశం ఇచ్చినప్పటికీ ఈ నియోజకవర్గాన్ని ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉప ఎన్నికల్లో గెలిచి మూడేళ్లు గడుస్తున్న హుజురాబాద్ కు చేయలేదని, కనీసం తన సొంత మండలమైన కమలాపూర్ మండలంలోని ఉప్పల్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని సైతం పూర్తి చేయలేని పరిస్థితిలో ఈటెల రాజేందర్ ఉన్నారని అన్నారు. బిజెపి, టిఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటేనని బిజెపికి ఓటు వేస్తే టిఆర్ఎస్ కు వేసినట్టేనని, టిఆర్ఎస్ కు వేస్తే బిజెపికి వేసినట్లేనని తెలిపారు. ప్రశాంతంగా ఉన్న హుజురాబాద్ లో రౌడీయిజం, అరాచకాలు,  గన్ కల్చర్ పెరిగిపోయిందని అన్నారు. వ్యాపారులు భయభ్రాంతులకు గురవుతున్నారని తెలిపారు. వ్యాపారులకు స్వేచ్ఛ ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. వ్యాపారాలను అభివృద్ధి చేయడంతో పాటు పరిశ్రమలను తీసుకువచ్చి ఇక్కడ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని తెలిపారు. వ్యాపారులెవరు అధైర్య పడవద్దని హుజురాబాద్ నియోజకవర్గం లో గెలిచేది కాంగ్రెస్ పార్టీ అని ఆయన అన్నారు. వ్యాపారులకు అండగా ఉంటూ వారి అభివృద్ధి తోపాటు హుజూరాబాద్ ను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో. మండల అధ్యక్షుడు చరణ్ పటేల్. సీనియర్ నాయకులు బాలసాని రమేష్ గౌడ్. దేశిని ఐలయ్య. తవటం రవీందర్. వంశీధర్ రావు. బిక్షపతి. శివ చరణ్ . శ్రీనివాస్ .హనుమాన్ ప్రసాద్ పలు గ్రామాల అధ్యక్షులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related Posts