ఒంగోలు
ఒంగోలు లో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశం బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అద్యక్షతన ప్రారంభం అయింది. ప్రారంభం ఉపన్యాసం లో పురంధేశ్వరి మాట్లాడుతూ రాష్ట్రంలో కరవు పై అధ్యయనం చేయడానికి ప్రాంతాల వారీగా నాలుగు కమిటీ లు నియమిస్తున్నట్లు ప్రకటించారు.
రాష్ట్రంలో అరాచక, అవినీతి, విధ్వంస కర పాలన పై బిజెపి ఉద్యమం చేస్తుందన్నారు. సంస్థాగతంగా కార్యాచరణ పై సమావేశంలో చర్చించడం జరుగుతుందని అన్నారు.
తొమ్మిది న్నర సంవత్సరాల గా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సంక్షేమం పాలన అందిస్తున్నారు. దశాబ్దాల కాలం గా పెండింగ్ లో ఉన్న మహిళా బిల్లు కేంద్రం తీసుకుని వచ్చింది. మహిళా బిల్లు 33శాతం రిజర్వేషన్ అమలుకు చిత్తశుద్ధి తో బిజెపి ఉన్న విషయం వివరించారు.
ప్రతి పక్షాలు మహిళలుబిల్లు ను మభ్యపెడుతూ వచ్చాయి. ఎస్సీ వర్గీకరణ సామాజిక వర్గాల కోసం కేవలం బిజెపి మాత్రమే కట్టుబడి ఉంది. తొమ్మిది న్నర సంవత్సరాల గా సుపరిపాలన నరేంద్ర మోడీ అందిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం దారుణ మైన పాలన జరుగుతోంది. రాష్ట్రంలోఅధికారం లో అరాచకం, వినాశకర, విధ్వంసం పాలన జరుగుతోంది. రాష్ట్రంలొగర్భగుడిలో దేవుడు విగ్రహం దొంగలు పడి దోచుకున్నా పట్టించుకునే నాథుడే లేడు. ప్రభుత్వాన్ని ఎదిరిస్తే ఎట్రాసిటీ కేసులు పెడుతున్నారు. ఒక పక్క సమాజం లో అన్ని వర్గాల కు న్యాయం కేంద్రం చేస్తోంది. సామాజిక న్యాయం సాధికారత యాత్ర చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. ఎస్సీ కులాల సమగ్ర అభివృద్ధికి బిజెపి కట్టుబడి ఉంది. . బిసీ కమీషన్ చట్టబద్ధత కేంద్రం తీసుకుని వచ్చింది. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకు పోయినా ప్రభుత్వం మరమ్మతులు చేయడం లేదని విమర్శించారు.
టిటిడి అన్యమత స్తులు విషయం లో ప్రతి ఘటన చేసింది బిజెపి మాత్రమే. ప్రభుత్వం దిగి వచ్చేవరకు పోరాటం చేస్తాం. సర్పంచ్ లు ఆత్మ హత్య లకు పాల్పడ్డారు పంచాయతీ నిధులు కోసం బిజెపి పోరాటం చేసాం. బిజెపి ఉద్యమం చేసిన తర్వాత కేంద్రం అధికారులు వచ్చి పరిశీలన కు వచ్చారు. ఇసుక మాఫియా పై ప్రశ్నిస్తే, వ్యక్తి గత దూషణలు కు రాష్ట్ర ప్రభుత్వం దిగుతోంది. బిజెపి అవినీతి పైన పోరాటం చేస్తోంది. గళం విప్పింది బిజెపి మాత్రమే. కేంద్రం సహకారం వల్లే అభివృద్ధి జరుగుతోందని ఆమె అన్నారు.