YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఓటేసుడుతోటే దుకాణం ఒడిసిపోదు.. అక్కడే కథ మొదలైతది: సీఎం కేసీఆర్‌

ఓటేసుడుతోటే దుకాణం ఒడిసిపోదు..      అక్కడే కథ మొదలైతది: సీఎం కేసీఆర్‌

మానకొండూర్‌ నవంబర్ 20
ఓటేసుడుతోటే దుకాణం ఒడిసిపోదని, అక్కడే కథ మొదలైతదని సీఎం కేసీఆర్‌ అన్నారు.. దేశానికి స్వాతంత్య్ర వచ్చి 75 ఏండ్లు పూర్తయిన రావాల్సినంత ప్రజాస్వామ్య పరిణతి రాలేదని, ప్రజాస్వామ్య పరిణతి వచ్చినప్పుడే ప్రజలకు మేలు జరుగుతదని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మానకొండూర్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు. ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు ఆగమాగం కావద్దని అన్నారు.. మీరు గెలిపించిన ఎమ్మెల్యే వెనుక ఉన్న పార్టీ అధికారంలోకి వస్తదని చెప్పారు. కాబట్టి బాగా ఆలోచించి ఆచీతూచీ ఓటేయాలని సూచించారు.విచక్షణతోటి బాగా ఆలోచించి మంచి అభ్యర్థికి, మంచి పార్టీకి ఓటెయ్యాలి. మాయ మాటలు నమ్మి ఆషామాషీగా ఓటు వేయొద్దు. అమెరికా లాంటి దేశాల్లో ఇట్ల సభలు పెట్టి ఓట్లడుగరు. టీవీలల్లనే ప్రచారం చేస్తరు. మన దేశంల కూడా ఆ రోజులు రావాలె. ఏ పార్టీకి ఓటేస్తే మంచి జరుగుతది.. ఏ పార్టీకి ఓటేస్తే చెడు జరుగుతది..? అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయగలగాలె. ప్రజలకు ఉన్న ఒకే ఆయుధం ఓటు. ఆ ఓటును సక్రమంగా వినియోగించుకోవాలె’ అని సీఎం చెప్పారు.‘పార్టీల చరిత్ర, నడవడిక చూసి ఓటు వేయాలె. బీఆర్‌ఎస్‌ పార్టీ చరిత్ర ఏందో మీకు తెలుసు. బీఆర్‌ఎస్‌ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం. తెలంగాణ అభివృద్ధి కోసం. తెలంగాణ ఏర్పాటైనంక బీఆర్‌ఎస్‌ పార్టీ ఎంత బాగా అభివృద్ధి చేసిందో మీరందరూ చూస్తున్నరు. మరె 50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్‌ పార్టీ ఏం చేసింది..? అడుగడుగునా తెలంగాణను మోసం చేసింది. కాంగ్రెస్ పాలనలో ఎక్కడ చూసిన కరువు కాటకాలే ఉండె. పత్తికాయలు పగిలినట్లు రైతులు గుండెలు పగిలి చనిపోయిండ్రు. అదీ కాంగ్రెస్‌ పరిపాలన’ అని సీఎం ఎద్దేవా చేశారు

Related Posts