YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

“అజ్ఞాతవాసి”త్రివిక్రమ్ కెరీర్ లో మాయని మచ్చ

 “అజ్ఞాతవాసి”త్రివిక్రమ్ కెరీర్ లో మాయని మచ్చ

 నిరుత్సాహపడక తప్పదన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ అభిమాని 

‘కిచిడి’గా మార్చేసి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించారు

‘ఫస్ట్ టాక్’ బయటకు వచ్చింది

పవర్ స్టార్ అభిమానులు ఎన్నాళ్ళుగానో వేచిచూసిన “అజ్ఞాతవాసి” బొమ్మ వెండితెరపై పడింది. ‘జల్సా – అత్తారింటికి దారేది’ వంటి రెండు బ్లాక్ బస్టర్స్ బ్యాక్ బోన్ లో ఉన్న కాంబో కావడంతో, సహజంగా “అజ్ఞాతవాసి”పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. మరి ఆ అంచనాలను అందుకుందా? అంటే సినిమా చూసిన ప్రేక్షకుడు పవన్ కళ్యాణ్ అభిమాని అయితే మొహమాటం మీద ‘పర్లేదు’ అని చెప్పడానికి ఆస్కారం ఉందేమో గానీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ అభిమాని అయితే గనుక పూర్తిగా నిరుత్సాహపడక తప్పదన్న ‘ఫస్ట్ టాక్’ బయటకు వచ్చింది. ముందుగా పడిన యుఎస్ ప్రీమియర్స్ నుండే కాకుండా, వేకువజామునే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పడిన బెనిఫిట్ షోల నుండి కూడా ఇదే రకమైన టాక్ రావడంతో, ఉదయాన్నే పవన్ ఫ్యాన్స్ కు షాక్ తగిలినట్లయ్యింది. ముఖ్యంగా ఎవరి మీద అయితే పవన్ అభిమానులు, సాధారణ సినీ ప్రేక్షకులు నమ్మకం పెట్టుకున్నారో, ఆ త్రివిక్రమ్ ఈ “అజ్ఞాతవాసి”కి హైలైట్ కావడం విశేషం. సినిమా మొత్తమ్మీద క్లైమాక్స్ డైలాగ్ లు, ఒకటి, రెండు చోట్ల ఎలివేట్ చేసే సన్నివేశాలు, అన్నింటికీ మించి అద్భుతమైన నిర్మాణ విలువలు మినహాయిస్తే… చెప్పుకోవడానికి ఏమీ లేకపోగా, ఫైనల్ త్రివిక్రమ్ కార్నర్ అవ్వడం ఖాయమని చెప్పొచ్చు. ఎందుకంటే… ‘అజ్ఞాతవాసి’ అనే సినిమా ‘లార్గో వించ్’ అనే ఫ్రెంచ్ మూవీకి ‘ఫ్రీమేక్’గా తెరకెక్కించడం ఖచ్చితంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కెరీర్ లో మాయని మచ్చగా మారుతుందని చెప్పడంలో సందేహం లేదు. కేవలం ఆ సినిమా ‘ప్లాట్’ మాత్రమే తీసుకోకుండా, క్లైమాక్స్ తో సహా చాలా సన్నివేశాలు మక్కికి మక్కి దించేయడం అనేది గురూజీ నుండి ఊహించనిది కాకపోవడంతో, ఖచ్చితంగా విమర్శలకు అవకాశం ఇచ్చినట్లయ్యింది. గతంలో కూడా త్రివిక్రమ్ మీద ‘కాపీ కాట్’ అనే ముద్ర ఉన్నప్పటికీ, అది కేవలం సీన్స్ వరకే పరిమితం కాగా, ‘అజ్ఞాతవాసి’కి వచ్చేపాటికి మొత్తం సినిమానే కాపీ చేయడం విశేషం. నిజానికి ‘లార్గో వించ్’ సినిమాను మక్కికి మక్కి మొత్తం రీమేక్ చేసినా వర్కౌట్ అయ్యేదేమో! కానీ అనవసరమైన కామెడీ, వర్కౌట్ కానీ హీరోయిన్ల రొమాంటిక్ సన్నివేశాలతో… మొత్తం ‘కిచిడి’గా మార్చేసి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించారు. ఆహ్లాదకరమైన హాస్యాన్ని పండించడంలో ‘కింగ్’ అయిన త్రివిక్రమ్ సినిమాలో కామెడీ పండకపోవడం అసలు హైలైట్ గా మారింది. నిజానికి ‘అత్తారింటికి దారేది’ సినిమా సెకండ్ హాఫ్ లోనే కామెడీ వర్కౌట్ కాలేదు, కానీ అక్కడ పైరసీ సెంటిమెంట్ వర్కౌట్ కావడంతో, అది సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయింది. విశేషం ఏమిటంటే… ‘లార్గో వించ్’ ఒరిజినల్ డైరెక్టర్ కూడా “అజ్ఞాతవాసి”ని చూసి, ఇది తమ సినిమానే కదా అని విచారం వ్యక్తం చేసారు.
కథ :
ఏబీ గ్రూప్ అథినేత గోవింద భార్గవ్ తో(బొమన్ ఇరానీ) పాటుగా అతడి వారసుడిని కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేస్తారు. దీంతో గోవింద భార్గవ్ భార్య ఇంద్రాణీ (ఖుష్బూ) కంపెనీ వ్యవహారాలు చూసుకునేందుకు అస్సాం నుంచి బాలసుబ్రహ్మణ్యం (పవన్ కళ్యాణ్ ) అనే వ్యక్తిని తీసుకువస్తుంది. ఏబీ గ్రూప్ లో  మేనేజర్ గా జాయిన్ అయిన బాలసుబ్రహ్మణ్యం... గోవింద భార్గవ్ వారసుడి హత్యకు కారణాలను అన్వేషించటం మొదలు పెడతాడు. ఈ ప్రయత్నంలో బాలసుబ్రహ్మణ్యం విజయం సాధించాడా..? అసలు ఈ హత్య చేసింది ఎవరు..? గోవింద్ భార్గవ్, సీతారామ్‌ (ఆది పినిశెట్టి)లకు సంబంధం ఏంటి..? హత్యకు కారణాలు తెలుసుకోవడానికి ఇంద్రాణీ బాలసుబ్రహ్మణ్యాన్నే ఎందుకు ఎంచుకుంది..? బాలసుబ్రహ్మణ్యం.. అభిషిక్త భార్గవ్‌ ఎలా అయ్యాడు..? అన్నదే మిగతా కథ.

ప‌వ‌న్ క‌ల్యాణ్ వంటి హీరో సినిమా అంటేనే క‌థంతా అత‌ని చుట్టూనే తిరుగుతుంద‌న‌డంలో సందేహం లేదు. ఈ సినిమా క‌థ కూడా ప‌వ‌న్‌ను బేస్ చేసుకునే ర‌న్ అయ్యింది. బాల‌సుబ్ర‌మ‌ణ్యం, అభిష‌క్త భార్గ‌వ అనే రెండు షేడ్స్‌లో ప‌వ‌న్ న‌ట‌న ఆక‌ట్టుకుంది. సినిమా మొత్తాన్ని త‌న భుజాల‌పై ముందుకు తీసుకెళ్లాడు. త‌న‌దైన మార్కు డైలాగ్స్‌, యాక్ష‌న్స్ సీక్వెన్స్‌, న‌ట‌న‌తో ప‌వ‌న్ అభిమానులను మెప్పించ‌డం ఖాయం. ఇక సినిమాలో చెప్పుకోవాల్సిన మ‌రో పాత్ర ఖుష్బూ.. ఇంద్రాణి పాత్ర‌లో చ‌క్క‌గా ఒదిగిపోయింది. స్టాలిన్ త‌ర్వాత మ‌రోసారి తెలుగులో మంచి పాత్ర‌లో క‌న‌ప‌డింది ఖుష్బూ. క్లైమాక్స్‌లో ఖుష్బూ న‌ట‌న మెప్పిస్తుంది. ఇక సినిమాలో భాగ‌మైన కీర్తిసురేష్‌, అను ఇమాన్యుయేల్ పాత్ర‌లు గ్లామ‌ర్‌కే ప‌రిమిత‌మయ్యాయి. న‌ట‌న‌కు పెద్ద‌గా స్కోప్ లేని పాత్ర‌లు వారివి. ఇక విల‌న్‌గా న‌టించిన ఆది పినిశెట్టి త‌న పాత్ర‌కు న్యాయం చేశాడు. అయితే త‌న రోల్‌ను ఇంకా బ‌లంగా డిజైన్ చేసుంటే హీరో క్యారెక్ట‌రైజేష‌న్ ఎలివేట్ అయ్యుండేది. ముర‌ళీశ‌ర్మ‌, రావు ర‌మేష్ పాత్ర‌లు కామెడీకి ప‌రిమితం. మిగిలిన పాత్ర‌ధారులంద‌రూ వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. ఇక సాంకేతికంగా చూస్తే.. బేసిక్‌గా ర‌చ‌యిత అయిన త్రివిక్ర‌మ్ త‌న‌దైన డైలాగ్స్‌తో త‌న మార్కును చూపించారు. సంభాష‌ణ‌ల్లో డెప్త్ క‌న‌ప‌డుతుంది. అయితే క‌థ, క‌థ‌నంపై కేర్ తీసుకుని ఉంటే బావుండేద‌నిపించింది. విల‌న్ పాత్ర చిత్రీక‌ర‌ణ బ‌ల‌హీనంగా అనిపిస్తే, హీరోయిన్స్ పాత్ర‌ల‌కు సినిమాలో స్కోప్ లేకుండా పోయింది. ఇక ఈ సినిమా ద్వారా తెలుగులోకి మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ఎంట్రీ ఇచ్చిన అనిరుధ్ త‌న‌దైన స్టైల్లో మంచి సంగీతాన్ని అందించాడు. మూడు పాట‌లు బావున్నాయి. నేప‌థ్య సంగీతం బావుంది. ముఖ్యంగా ప‌వ‌న్ పాడిన కొడ‌కా కోటేశ్వ‌ర‌రావా పాట ఆక‌ట్టుకుంటుంది. మ‌ణికంద‌న్ ప్ర‌తి స‌న్నివేశాన్ని చ‌క్క‌గా చిత్రీక‌రించాడు. ప‌వ‌న్‌, త్రివిక్ర‌మ్ కాంబోలో వ‌చ్చిన హ్యాట్రిక్ మూవీ కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. పెద్ద కంపెనీ యాజ‌మానుల మ‌ధ్య పోరు అంటే ఎత్తులు, పై ఎత్తులు ఉండ‌టం.. హీరో ఎంట్రీ వ‌చ్చి త‌న కుంటుంటాన్ని కాపాడుకోవడం వంటి స‌న్నివేశాలను చాలా సినిమాల్లో ప్రేక్ష‌కులు చూసేశారు. సినిమాలో ఓ ద‌శ‌లో ప్రేక్ష‌కుడి మెయిన్ కాన్సెప్ట్ అర్థ‌మైపోతుంది కాబ‌ట్టే క‌థ‌పై ఉన్న ఆస‌క్తి త‌గ్గిపోతుంది. అలాగే క‌థ‌లో స‌బ్ ప్లాట్స్ కూడా ఎక్కువైపోయాయి. 

Related Posts