YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ తో సీఎం కేసీఆర్ భేటీ

కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్  తో  సీఎం కేసీఆర్ భేటీ

కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్  సింగ్ తో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సోమవారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. కొత్త జోనల్ విధానం,  పునః విభజన చట్టం లోని పలు అంశాలపై కేంద్ర హోం మంత్రి తో చర్చించారు. కొత్త రాష్ట్రంలో 7 జోన్లు, 2 మల్టీ జోన్ల వ్యవస్థ ఏర్పాటు చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న విషయం కేంద్ర మంత్రి దృష్టికి సీఎం తీసుకువచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అమలులో ఉన్న జోన్ల వ్యవస్థ లలో, మొత్తం ఆరు జోన్లుకు గాను, నాలుగు ఆంధ్రాలోనూ, 5,6 జోన్లు తెలంగాణలో నూ ఉండేవి. పరిపాలన సౌలభ్యం కోసం తెలంగాణ రాష్ట్రం ఎర్పడిన తరువాత ఉన్న 10 జిల్లాలను 31 జిల్లాలుగా విభజించడం జరిగింది. అన్ని ప్రాంతాల వారికి సమ ప్రాధాన్యత  ఇవ్వాలనే లక్ష్యంతో గతంలో "రాష్ట్రపతి ఉత్తర్వులు” ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో అమలు అయ్యాయని అయన కేంద్రమంత్రికి తెలిపారు. మొత్తం 31 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత  గతంలో అమలైన  "రాష్ట్రపతి ఉత్తర్వులు” మరలా తెలంగాణ రాష్ట్రానికి వర్తించే విధంగా,  సరికొత్తగా “రాష్ట్రపతి ఉత్తర్వులను జారీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని రాజనాధ్ సింగ్ ను ముఖ్యమంత్రి కేసిఆర్ కోరారు. అదివారం మంత్రివర్గ సమావేశం తరువాత అయన ఢిల్లీకి వచ్చారు. నాలుగు రోజులపాటు కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో వుంటారు.

Related Posts