YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ పై సుప్రీంకోర్టు సీరియ‌స్

త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ పై సుప్రీంకోర్టు సీరియ‌స్

న్యూఢిల్లీ నవంబర్ 20
త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ ఆర్ఎన్ ర‌విపై సుప్రీంకోర్టు సీరియ‌స్ అయ్యింది. రాష్ట్ర అసెంబ్లీ పాస్ చేసిన బిల్లుల‌ను ఎందుకు క్లియ‌ర్ చేయ‌లేద‌ని అడిగింది. మూడేళ్లుగా గ‌వ‌ర్న‌ర్ ఏం చేస్తున్నార‌ని ప్ర‌శ్నించింది. 2020 నుంచి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయ‌ని, మూడేళ్ల నుంచి ఆయ‌న ఏం చేస్తున్నార‌ని సుప్రీం అడిగింది. ఇటీవ‌ల గ‌వ‌ర్న‌ర్ ర‌వి తిప్పి పంపిన 10 బిల్లుల‌ను మ‌ళ్లీ రాష్ట్ర అసెంబ్లీలో పాస్ చేశారు. సీఎం స్టాలిన్ ప్ర‌త్యేక స‌మావేశంలో ఆ బిల్లుల‌కు మ‌ళ్లీ ఆమోదం తెలిపిన విష‌యం తెలిసిందే. దాంట్లో రెండు అన్నాడీఎంకే స‌ర్కార్ స‌మ‌యంలో పాస్ చేశారు.త‌మిళ‌నాడుతో పాటు పంజాబ్‌, కేర‌ళ రాష్ట్రాలు దాఖ‌లు చేసిన పిటీష‌న్ల‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచార‌ణ జ‌రిగింది. ఆ స‌మ‌యంలో త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ వైఖ‌రిని ప్ర‌శ్నించారు. అసెంబ్లీలో మ‌ళ్లీ బిల్లుల‌ను పాస్ చేశార‌ని, గ‌వ‌ర్న‌ర్‌కు పంపార‌ని, ఆయ‌న ఏం చేస్తారో చూద్దామ‌ని కోర్టు పేర్కొన్న‌ది. ఈ కేసును మ‌ళ్లీ డిసెంబ‌ర్ ఒక‌టో తేదీకి వాయిదా వేశారు.

Related Posts