YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

గంగుల కు రెండు సార్లు అధికారమిస్తే భూములు కొల్లగొట్టిండు...

గంగుల కు రెండు సార్లు అధికారమిస్తే భూములు కొల్లగొట్టిండు...

కరీంనగర్
గంగుల  కమలాకర్ కు 2సార్లు అధికారమిస్తే భూములు కొల్లగొట్టిండు... గుట్టలనే ధ్వంసం చేసిండు.. పొరపాటున మళ్లీ గెలిపిస్తే..ఈసారి ఏకంగా మీ మీ ఇండ్లను కొట్టేయడం ఖాయం... గంగులతోపాటు కాంగ్రెస్ అభ్యర్ధిది భూకబ్జాల పంచాయతీ... నాది పేదల కోసం ఎంతకైనా తెగించే నైజం... ఎటువైపు ఉంటారో మీరే తేల్చుకోండి...’’ అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ ప్రజలను కోరారు. బీఆర్ఎస్ కు రెండుసార్లు అధికారమిస్తే ధనిక రాష్ట్రాన్ని అప్పులపాల్జేసి పుట్టబోయే బిడ్డపై కూడా లక్షన్నర రూపాయల అప్పు భారం మోపారని మండిపడ్డారు. ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ నియోజకవర్గంలోని జూబ్లీనగర్ గ్రామానికి వచ్చిన బండి సంజయ్ కుమార్ ఫకీర్ పేట్, జూబ్లినగర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు
కాంగ్రెస్ అభ్యర్ధికి కరీంనగర్ గురించే తెల్వదు. రేషన్ కార్డులు ఎట్లస్తిరో.. పెన్షన్ ఎట్లస్తిరో కూడా తెల్వదు... భూకబ్జాలు తప్ప మరేమీ తెల్వదు... ప్రజల కోసం ఎన్నడూ కొట్లాడలేదు... మీకోసం ఎన్నడైనా డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం కొట్లాడారా? పెన్షన్, రేషన్ కార్డుల కోసం ఉద్యమించారా?
వడగండ్ల వాన కోసం పరిహారం ఇవ్వకపోతే నేను కొట్లాడిన. పద్మశాలీలు కలర్ వేయొద్దని మీపై ఒత్తిడి తెస్తే నేను అడ్డుకున్నా...మీ ఇండ్ల కోసం నేను పోరాడిన. మీ పిల్లల కోసం నేను ఉద్యమించిన. ఎంపీగా ఎన్నికైప్పటి నుండి మీకోసం పోరాడుతూనే ఉన్నా. ఎన్నడూ ఇంట్లో కూర్చోలేదు. కేంద్రం నుండి రూ.9 వేల కోట్లు తీసుకొచ్చిన. నేను నిధులు తీసుకొస్తే... సిగ్గులేకుండా గంగుల కమలాకర్ ఆ నిధులు తానే తెచ్చినట్లు ఫోజులు కొడుతూ కొబ్బరికాయలు కొడుతున్నడు... రేషన్ బియ్యం ఉచితంగా పేదలకు ఇచ్చేది కేంద్రమే. కానీ సిగ్గు లేకుండా కేసీఆర్ ఫొటో పెట్టుకుంటున్నడు..
అబద్దాలాడటంలో గంగులను మించినోడు లేరు. డబ్బులు పంచి, అబద్దాలాడి ప్రజలను మోసం చేయడంలో గంగుల నెంబర్ వన్. రేషన్ మంత్రిగా ఉంటూ రేషన్ కార్డులే ఇయ్యలేనోడు.. బీసీ మంత్రిగా ఉంటూ బీసీ బంధు ఇవ్వలేనోడు.. 2 సార్లు అధికారమిస్తే భూకబ్జాలు చేసిండు... గుట్టలు మాయం చేసిండు.. పొరపాటున మళ్లీ గెలిస్తే.. మీ ఇండ్లను కూడా కొట్టేయడం ఖాయం... ఇప్పటికే రాష్ట్రాన్ని అప్పులపాల్జేసి పుట్టబోయే బిడ్డపై కూడా లక్షన్నర రూపాయల అప్పు భారం మోపారు. నన్ను అవినీతిపరుడంటున్నడు.. నేను అధికారంలోనే లేను. అవినీతికి ఎట్లా పాల్పడతా? అధికారంలో ఉన్నది మీరే కదా....అవినీతికి పాల్పడితే అరెస్ట్ ఎందుకు చేయలేదు. నేను నిజంగా అవినీతిపరుడనైతే సవాల్ చేస్తున్నా.... నా ఆస్తిపాస్తుల డాక్యుమెంట్లన్నీ తీసుకురావాలి. అవన్నీ ప్రజలకు పంచేస్తా... మరి నువ్వు కూడబెట్టిన ఆస్తిపాస్తుల డాక్యుమెంట్లన్నీ పట్టుకొస్తా... ప్రజలకు రాసిచ్చేందుకు సిద్దమా?  వాళ్లది భూకబ్జాల పంచాయతీ... నాది ప్రజల కోసం చావడానికైనా వెనుకాడని నైజం ఎటువైపు ఉంటారో మీరే తేల్చుకోండి...

Related Posts