YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఓటర్ సమాచార స్లీప్ లు బి.ఎల్.ఓ ల ద్వారా ఓటర్లకు పంపిణీ

ఓటర్ సమాచార స్లీప్ లు బి.ఎల్.ఓ ల ద్వారా ఓటర్లకు పంపిణీ

జయశంకర్ భూపాలపల్లి
  భూపాలపల్లి శాసనసభ నియోజకవర్గం పరిధిలో  బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓ) ద్వారా ఓటర్ సమాచార  చీటీల పంపిణీ కార్యక్రమాన్ని  చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ సోమవారం ఒక ప్రకటనలో తెలయజేశారు.
పట్టణంలోని అన్ని వార్డులతో పాటు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోనీ బీఎల్ఓ లకు ఓటర్ సమాచార స్లీప్ లు అందజేయడం జరుగుతున్నదని, పోలింగ్ కు ముందుగానే ప్రతి ఓటరుకు సంబంధించిన పోల్ చీటీలు అందజేస్తామని తెలిపారు.
ప్రతి పోల్ స్లిప్ పై భారత ఎన్నికల సంఘం బార్ కోడ్ ముద్రించి ఉంటుందన్నారు. దాన్ని స్కాన్ చేస్తే పోలింగ్ కేంద్రం పూర్తి వివరాలు ప్రత్యక్షం అవుతాయని తెలిపారు. భూపాలపల్లి నియోజకవర్గంలోని మొత్తం 317 పోలింగ్ కేంద్రాల పరిధి లో ఇప్పటి వరకు 2,73,633 స్లిప్పులకు గాను 1,55,426 స్లీప్ లు 56.8% పంపిణీ జరినదని మిగిలినవి రెండు,మూడు రోజుల్లో స్లిప్ ల పంపిణీ చేసేలా ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు. ఈ చీటీతో పాటు ఎన్నికల సంఘం సూచించిన 15 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకదాన్ని తీసుకుని ఓటర్లు ఈ నెల 30న  జరిగే పోలింగ్ కేంద్రానికి  ఉదయం 7 నుండి సాయంత్రం 4 గంటలోపు వెళ్లి  తమ  అమూల్యమైన ఓటు హక్కు ను వినియోగించుకోవాలని  జిల్లా ఎన్నికల అధికారి ఈ  ప్రకటనలో విజ్ఞప్తి  చేశారు.

Related Posts