YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

భారీగా పెరిగిన సైబర్ దాడులు

భారీగా పెరిగిన సైబర్ దాడులు

చెన్నై, నవంబర్ 21,
గ్లోబల్ యావరేజ్తో పోలిస్తే ఇండియాలో సైబర్ దాడులు రెండు రెట్లు పెరిగాయని నేషనల్ సైబర్ సెక్యూరిటీ కో ఆర్డినేటర్ ఎంయూ నాయర్ తెలిపారు. గడిచిన 10 నెలల కాలంలో సగటున దాదాపు రూ.12,826 కోట్ల వరకు రాన్సమ్‌‌వేర్ దాడుల చెల్లింపులు జరిగాయని వివరించారు. 2022 నుంచి సైబర్ దాడులు రెట్టింపు అయ్యాయని తెలిపారు. ‘‘సినెర్జియా కాన్‌‌క్లేవ్ – 2023’’ కార్యక్రమంలో భాగంగా ‘‘అలైన్ టెక్నాలజీస్ టూ ఫ్యూచర్ కాన్‌‌ఫ్లిక్టస్’’ సెషన్‌‌లో పాల్గొన్న ఆయన సైబర్ దాడులకు సంబంధించిన కీలక విషయాలు వెల్లడించారు. సైబర్ దాడుల విషయంలో అధికారికంగా వెలుగులోకొచ్చిన చెల్లింపులే రూ.12,826 కోట్లు అని, అనధికారిర చెల్లింపులు కూడా వేల కోట్లలోనే ఉంటాయని నాయర్ చెప్పారు. గడిచిన ఆరు నెలల్లోనే ఇండియన్ సైబర్ స్పేస్ వారానికి సగటున 2,126 సార్లు సైబర్ దాడులను చూసిందన్నారు. గ్లోబల్ యావరేజ్ వారానికి చూసుకుంటే 1,108 సార్లే అని వివరించారు. దీంతో పోల్చుకుంటే ఇండియాలో సైబర్ దాడులు చాలా ఎక్కువ అని తెలిపారు. సైబర్ స్పేస్లో ఈ తరహా దాడులు నియంత్రించడానికి ప్రపంచ దేశాలన్నీ కలిసి రావాలని పిలుపునిచ్చారు. యునైటెడ్ నేషన్స్, రీజినల్ ఫోరమ్లో సైబర్ దాడులు కట్టడి చేసే ప్రోగ్రామ్స్ ఉన్నాయని నాయర్ చెప్పారు. ఇక్కడ సైబర్ దాడుల సమస్యకు అన్ని దేశాలు కలిసికట్టుగా పరిష్కారం వెతుకుతున్నాయని వివరించారు. యూఎన్ గ్రూప్ ఆఫ్ గవర్నమెంటల్ ఎక్స్పర్ట్స్ సైబర్ స్పేస్లో కీలక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నదన్నారు. 2021ఈ గ్రూప్.. ఇంటర్నేషనల్ సైబర్ సెక్యూరిటీ డెవలప్మెంట్కు ఉపయోగపడే ఎన్నో రికమండేషన్లను అందించిందని తెలిపారు. ఇవి సైబర్ సెక్యూరిటీ నిబంధనలను బలోపేతం చేస్తాయన్నారు.

Related Posts