YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

భాగ్యనగర్ లో చతుర్ముఖ పోటీ

భాగ్యనగర్ లో చతుర్ముఖ పోటీ

హైదరాబాద్, నవంబర్ 21,
ఎన్నికలు రాష్ట్రం అంతటా ఒకలా ఉంటే గ్రేటర్ హైదరాబాద్‌లోని ఆ నియోజకవర్గాల్లో మరోలా ఉంటాయి. రాష్ట్రంలోని దాదాపు సగానికి పైగా సెగ్మెంట్లలో త్రిముఖ పోటీ ఉంటే.. గ్రేటర్ హైదరాబాద్‌లోని 9 సెగ్మెంట్లలో మాత్రం చతుర్ముఖ పోటీ ఉంది. ఇంతకీ ఎంటా సెగ్మెంట్లు? అక్కడ పోటీపై ఎందుకంత ప్రాధాన్యత తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే..ఇక హైదరాబాద్ పరిధిలో ఉన్న 9సెగ్మెంట్లలో చతుర్ముఖ పోటీ నెలకొంది. ఎందుకంటే ఎంఐఎం పార్టీ బరిలో ఉన్న స్థానాల్లో చతుర్ముఖ పోటీ ఉంటుందని  రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. మలక్ పేట, ముషీరాబాద్, జూబ్లీ హిల్స్, నాంపల్లి, ఖార్వన్, చార్మినార్, చంద్రయాన్ గుట్ట, యాకుత్ పురా, బహాదుర్ పురా, రాజేంద్ర‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు బరిలో నిలిచాయి. అయితే గట్టి పోటీ ఏవైనా రెండు పార్టీల మధ్య ఢీ అంటే ఢీ అన్నట్లు ఉన్నా చతుర్ముఖ పోటీ ఉన్నట్లు చెబుతున్నారు విశ్లేషకులు. రాష్ట్రమంతటా జరిగే ఎన్నికల వేడి ఒకలా ఉంటే.. సిటీలో జరిగే ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు సీరియస్‌గా తీసుకుంటున్నాయి.తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో పోలింగ్ తేది సమీపిస్తున్న వేళ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ పెరుగుతోంది. రాష్ట్రంలోని దాదాపు 30 సెగ్మెంట్లలో త్రిముఖ పోటీ ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతుంటే గ్రేటర్ పరిధిలోని ఆ 9 అసెంబ్లీ సెగ్మెంట్లలో పరిస్తితి వేరుగా ఉంది. రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీల దృష్ట్యా జిల్లాల్లో త్రిముఖ పోటీ ఉంటే.. సిటిలో మాత్రం చతుర్ముఖ పోటీ నెలకొంది.రాష్ట్రంలో త్రిముఖ పోటీ ఉన్న సెగ్మెంట్లు కరీంనగర్, మానకొడురు, హుజూరాబాద్, చొప్పదండి, మంథని, వేములవాడ, జగిత్యాల, కోరుట్ల, నిజామాబాద్ అర్బన్, అదిలాబాద్, ఆర్మూర్, నిర్మల్, ఖానాపూర్, సిర్పూర్, పఠాన్ చేరు, హుస్నాబాద్, వరంగల్ తూర్పు, కల్వకుర్తి, ముతొల్, కామారెడ్డి, సూర్యాపేట, ఖైరతాబాద్, కుత్బుల్లాపూర్, ఎల్బీ నగర్, శేరిలింగంపల్లి, ఉప్పల్, రాజేంద్ర‌నగర్, మహేశ్వరం, మహబూబ్‌నగర్, మల్కాజ్‌గిరి ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లోని అభ్యర్థులు త్రిముఖ పోటీలో ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Related Posts