YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కరీంనగర్ లో మంత్రులు లక్ష్మారెడ్డి, ఈటల పర్యటన

కరీంనగర్ లో మంత్రులు లక్ష్మారెడ్డి, ఈటల పర్యటన

కరీంనగర్ జిల్లా కేంద్రం లో మ౦త్రులు లక్ష్మా రెడ్డి, ఈటెల రాజేందర్ పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. జిల్లా ప్రధాన ఆసుపత్రీ లో డయాలోసిస్ సెంటర్, వెల్  నేస్ సెంటర్, పలు అర్బన్ హెల్త్ సెంటర్స్ ను ప్రారంభించారు. తరువాత  ఉత్తర తెలంగాణ లోనే వరంగల్ తరువాత అంతటి అధునాతన సదుపాయాలతో  నిర్మించిన ఆయుష్ హాస్పిటల్ కి శంకుస్థాపన చేసారు.  ఈ సందర్బంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి  లక్ష్మారెడ్డి  రెడ్డి  మాట్లాడుతూ జిల్లా కేంద్రం లో వెల్నెస్ సెంటర్ తోపాటు డయాలసిస్ సెంటర్, నగరంలో మూడు  అర్బన్ హెల్త్ సెంటర్ లను ప్రారంభించామని తెలిపారు.  ప్రభుత్వం విద్య,  వైద్యం కు ప్రథమ ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. గత ప్రభుత్వాల పనితీరుకు నేటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలనకు చాలా వ్యత్యాసం ఉందని, రోగులకు అన్ని రకాల సదుపాయాలతో పాటు ఉచితంగా వైద్య సధుపాయాన్నిస్తున్నాం అన్నారు. దేశం లో ఎక్కడ లేని విధంగా 40 డయాలసిస్ సెంటర్  లను రాష్ట్రం లో ఏర్పారు చేసుకుంటున్నాము. డయాలసిస్ సెంటర్ లను కార్పోరేట్ హాస్పిటల్ లకు ధీటుగా వైధ్యసేవలను అందిస్తామన్నారు.  దూరప్రాంతాలకు వెళ్ళి వైద్యం చేసుకునే వారికి ఈ సెంటర్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. రాష్ట్రం లో 1500 బస్తీలలో బస్తీ దవాఖానాలను  త్వరలోనే ఏర్పాటు చేస్తాం అని తెలిపారు.  వైద్య రంగంలో అలోఫతి తోపాటు ఆయుష్ కుడా అభివృద్ధి చెందే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దానిలో భాగంగా కరీంనగర్ లో 20 పడకల అయుష్ దవాఖానకు భూమి పూజ చేసామని అన్నారు.

Related Posts