న్యూ డిల్లీ నవంబర్ 21
సొంత గడ్డపై జరిగిన వన్డే వరల్డ్ కప్ లో భారత జట్టుఆఖరి మెట్టుపై బోల్తా పడడం కోట్లాది మంది గుండెల్ని పిండేసింది. అది కూడా 2003 ఫైనల్లో కప్పును లాగేసుకున్న ఆస్ట్రేలియా చేతిలో ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీమిండియా ఓటమిని తట్టుకోలేని ఒక అభిమాని ఒకరు ‘నువ్వు కోట్లాది గుండెల్ని ముక్కలు చేశావు’ అని వార్నర్‌కు పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ చూసి భారతీయుల బాధను అర్ధం చేసుకొన్న డేవిడ్ భాయ్.. వరల్డ్ కప్ గెలిచినందుకు క్షమాపణలు చెప్తున్నా అని స్పందించాడు. ‘వరల్డ్ గెప్ గెలిచినందుకు క్షమాపణలు చెప్తున్నా. వరల్డ్ కప్ ఫైనల్ నిజంగా ఒక అద్బుతమైన మ్యాచ్. అహ్మదాబాద్ స్టేడియం వాతావరణం చాలా గొప్పగా ఉంది. భారత జట్టు చాలా తీవ్రంగా ప్రయత్నించింది. అందరికీ ధన్యవాదాలు’ అని వార్నర్ తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చాడు.వార్నర్ సారీ చెప్పడానికి ఓ కారణం ఉంది. అదేంటంటే..? ఆ పోస్ట్ చూసి భారతీయుల బాధను అర్ధం చేసుకొన్న డేవిడ్ భాయ్.. వరల్డ్ కప్ గెలిచినందుకు క్షమాపణలు చెప్తున్నా అని స్పందించాడు. తద్వారా ఈ డాషింగ్ ఓపెనర్ ఇండియన్స్ పట్ల తనకున్న అభిమాన్ని మరోసారి చాటుకున్నాడు. ప్రపంచ కప్ ఫైనల్లో భారత్‌పై 6 వికెట్లతో గెలిచిన ఆస్ట్రేలియా ఆరోసారి విశ్వవిజేతగా అవతరించింది. ఈ ఏడాది జూన్ నెలలో ఇంగ్లండ్ గడ్డపై టెస్టు గదను తన్నుకుపోయిన కమిన్స్ సేన ఈసారి వరల్డ్ కప్‌ను ఎగరేసుకుపోవడం ఇండియన్ ఫ్యాన్స్‌కు మింగుడుపడడం లేదు.