YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కేటీఆర్…నీకెంత కండకావరం? ఉద్యోగాలడిగితే… దూషిస్తావా?

కేటీఆర్…నీకెంత కండకావరం? ఉద్యోగాలడిగితే… దూషిస్తావా?

కరీంనగర్
కేటీఆర్ కు కండ కావరం తలకెక్కింది. నిరుద్యోగులు ఉద్యోగాలెందుకివ్వడం లేదని నిరసన తెలిపితే… తప్పు చేశానని చెంపలేసుకోవాల్సిన కేటీఆర్ చెత్త నాకొడుకుల్లారా… సన్నాసుల్లారా.. అంటూ బూతులు తిడుతున్నాడు.. ఆయనకు అహంకారం ఎక్కువైంది. తెలంగాణ యువకులారా… బీఆర్ఎస్ ని ఓడించి గుణపాఠం చెప్పి యువకుల సత్తా చాటండి’’  అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్ధి  బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు.
కేసీఆర్…. నీకేమో వంద గదుల ప్రగతి భవన్ కావాలే… నిలువ నీడలేని పేదలకు మాత్రం ఇండ్లు ఎందుకు ఇవ్వలే… నీ కుటుంబంలోని అందరికీ కొలువులిచ్చినవ్… మరి తెలంగాణలోని నిరుద్యోగులు ఏం పాపం చేశారు? ఇంటికొక ఉద్యోగమైనా ఎందుకివ్వలే? కనీసం నిరుద్యోగ భ్రుతి ఇస్తానని ఎందుకివ్వలే? ఇదే విషయంపై ప్రశిస్తూ మీకోసం నేను కొట్లాడితే 74 కేసులు పెట్టి జైలుకు పంపారు… బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్ధులిద్దరిదీ భూకబ్జాల భాగోతం… నాది పోరాటాల చరిత్ర.. ఎటువైపు ఉంటారో ఆలోచించి ఓటేయాలని కోరుతున్నానని అన్నారు.
గంగుల కమలాకర్ మాటలను చూస్తే నాకు నవ్వొస్తుంది. కమలాకర్ కేఏ పాల్ తమ్ముడు. జోకర్ లెక్క మాట్లాడుతున్నడు…ఏం మాట్లాడుతున్నడో ఆయనకే అర్ధం కావడం లేదు. నేను అవినీతిపరుడినట.. టిక్కెట్ ను రూ.20 కోట్లకు అమ్ముకున్నానట… ఆస్తులు సంపాదించానట.. డబ్బు సంచులున్నయట. గంగులకు నేను సవాల్ చేసిన.. నాపేరు మీదు, బినామీ పేరుమీద ఉన్న ఆస్తిపాస్తుల డాక్యుమెంట్లన్నీ తీసుకురా… అవన్నీ కరీంనగర్ ప్రజలకు రాసిస్తా…. నీ పేరు, నీ కుటుంబ సభ్యుల, బినామీల పేరిట ఉన్న డాక్యుమెంట్లన్నీ తీసుకొస్తా… ప్రజలకు రాసిచ్చేందుకు సిద్దమా అని అన్నారు.

Related Posts