YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

స్టెరిలైట్ ఫ్యాక్టరీ తొలగిస్తాం

స్టెరిలైట్ ఫ్యాక్టరీ తొలగిస్తాం

తమిళనాడులోని తూత్తుకుడిలో ఉప ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం సోమవారం పర్యటించారు. స్టెరిలైట్ కాపర్ పరిశ్రమకు వ్యతిరేకంగా ఇక్కడ పెద్ద ఎత్తున ఉద్యమం జరిగిన విషయం తెలిసిందే. పోలీసుల కాల్పుల్లో 13 మంది మరణించారు. ఇటీవలి పోలీసుల కాల్పుల్లో గాయపడి చికిత్స పొందుతున్న వారిని పన్నీరు సెల్వం పరామర్శించారు. స్టెరిలైట్ కాపర్ ప్లాంట్ ను మూసివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వీలైన అన్ని చర్యలు తీసుకుంటామని పన్నీరు సెల్వం మీడియాకు తెలిపారు. మరోవైపు తూత్తుకుడిలో స్టెరిలైట్ కాపర్ ప్లాంట్ తొలగింపునకు ఆదేశాలివ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.దీనిపై అత్యవసర విచారణ నిర్వహించాలన్న పిటిషనర్ వినతిని కోర్టు తిరస్కరించింది. వేసవి సెలవుల తర్వాతే విచారిస్తామని స్పష్టం చేసింది. తూత్తుకుడిలో పోలీసుల కాల్పులు జరిగి, 13 మందిని పొట్టన పెట్టుకున్న ఘటనపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో వేరొక పిటిషన్ కూడా దాఖలైంది.

Related Posts