YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ప్రిసైడింగ్‌ అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి

ప్రిసైడింగ్‌ అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి

నాగర్ కర్నూల్
ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత ప్రిసైడింగ్‌ అధికారుల (పీఓల)దేనని అచ్చంపేట కొల్లాపూర్ నియోజకవర్గాల ఎన్నికల సాధారణ పరిశీలకులు సతీష్ కుమార్ అన్నారు.
బుధవారం నాగర్ కర్నూల్ సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో అచ్చంపేట నియోజకవర్గానికి కేటాయించబడిన ప్రిసైడింగ్‌ అధికారులు, సహాయ ప్రిసైడింగ్‌ అధికారులకు నిర్వహిస్తున్న రెండోవ విడత శిక్షణ తరగతులను ఆయన సందర్శించారు.
పోలింగ్‌కు ఒకరోజు ముందు, పోలింగ్‌ రోజు ఎన్నికల సిబ్బంది చేయాల్సిన పనులను ఆయన అడిగి తెలుసుకున్నారు.
ఉపాధ్యాయులు పూర్తి అవగాహనతో ఎన్నికల విధులను నిర్వహించగలరని అన్నారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ......
ఎన్నికలకు సంబంధించి ప్రతి విషయాన్ని తెలియజేసే హ్యాండ్‌ బుక్‌లను తప్పనిసరిగా సరిచూసుకోవాలన్నారు.
పీఓలు, ఏపీఓలు, పోలింగ్‌ సిబ్బంది డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుండి తీసుకువెళ్లే ఎన్నికల సామాగ్రిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుండి వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఈనెల 29వ తేదీన  వారికి కేటాయించిన నియోజకవర్గ డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లకు చేరుకొని రిపోర్ట్‌ చేయాలని సూచించారు.
పివో, ఏపీఓలు ఈవీఎంలపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలన్నారు.
ఏదైనా సందేహాలు ఉంటే సంబంధిత సెక్టర్ అధికారిని సంప్రదించాలని సూచించారు.
ఈ సందర్భంగా కలెక్టరేట్లో  ఎన్నికల సిబ్బందికి పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ కోసం ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్‌ సందర్శించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట రిటర్నింగ్‌ అధికారి గోపిరామ్, ఎన్నికల శిక్షణ నోడల్‌ అధికారి నర్సింగ్ రావు, పదరా తాహసిల్దార్ తబిత, తహసీల్దార్‌ బల్మూర్ సలీముద్దీన్, మాస్టర్‌ ట్రైనర్‌ చంద్రశేఖర్, శ్రీకాంత్, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts