YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఓ వైపు క్వాష్.. మరో వైపు బెయిల్ రద్దు సుప్రీం కోర్టులో విచారణ

ఓ వైపు క్వాష్.. మరో వైపు బెయిల్ రద్దు సుప్రీం కోర్టులో విచారణ

న్యూఢిల్లీ, నవంబర్ 23,
ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దుపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై ఈ నెల 24న సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. జగన్ అక్రమాస్తుల కేసులో గత పదేళ్లుగా బెయిల్‌పై ఉన్నారని, విచారణ వేగవంతం చేయాలని రఘురామ తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ చేశారు. ఈ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. హైకోర్టు ఉత్తర్వులను రఘురామ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ పై జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓఖా, జస్టిస్ పంకజ్ మిత్తల్‌ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టనుంది.టీడీపీ అధినేత చంద్రబాబు మద్యం, ఇసుక కేసుల్లో హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై  విచారణ జరిగింది. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది. మద్యం కేసులో చంద్రబాబు, కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై విచారణను హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది. ఇసుక విధానం కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. ఈ రెండు కేసుల్లో చంద్రబాబు తరఫు న్యాయవాదుల వాదనలు ముగిశాయి. రాజకీయ కక్షతోనే కేసులు పెట్టారని, సీఐడీ అభియోగాలపై ఆధారాలు లేవని వాదనలు వినిపించారు. చంద్రబాబుపై అభియోగాలు నమోదుకు గవర్నర్ అనుమతి తీసుకోలేదని, 17ఏ నిబంధన వర్తిస్తుందని పేర్కొన్నారు. ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే ఉచిత ఇసుక ఇచ్చారని, దీంతో రాష్ట్ర ఖజానాకు నష్టం జరిగిందని అనడానికి వీల్లేదన్నారు. ఉచిత ఇసుక విధానం చట్ట విరుద్ధం కాదని వాదనలు వినిపించారు. ఇసుక ధరలు అధికంగా ఉన్న సమయంలో పేదలకు, భవన నిర్మాణ పనులకు టీడీపీ ప్రభుత్వం ఉచితంగా ఇసుక ఇవ్వాలని ఈ విధానాన్ని అమలుచేసిందని కోర్టుకు తెలిపారు.మద్యం కేసులో సీఐడీ తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. పబ్లిక్ సర్వెంట్‌గా ఉన్న చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని వాదించారు. మంత్రి మండలి నిర్ణయానికి విరుద్ధంగా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని సీఐడీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో రాష్ట్ర ఖజానాకు భారీగా నష్టం వచ్చిందని పేర్కొన్నారు. మద్యం విధానంలో అవినీతి జరిగిందని, ఎక్సైజ్ పాలసీని 5 నుంచి 10 శాతానికి ఉద్దేశ పూర్వకంగా మార్చారని సీఐడీ అభియోగించింది. కొంతమందికే లబ్ధి చేకూరేలా మద్యం లైసెన్స్ విధానంలో మార్పులు చేశారని సీఐడీ తరఫు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను  వాయిదా వేసింది.

Related Posts