YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

నిరుద్యోగులు బీఆర్ఎస్ ను గద్దె దింపాలి ప్రియంకా గాంధీ

నిరుద్యోగులు బీఆర్ఎస్ ను గద్దె దింపాలి ప్రియంకా గాంధీ

ప్రియాంక కు భట్టి స్వాగతం
ఖమ్మం
ఎన్నికల ప్రచారానికి ఖమ్మం వచ్చిన  ఎఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ  హెలిప్యాడ్ వద్ద సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఘనంగా స్వాగతం పలికారు.ప్రియాంక గాంధీ గారి మెడలో పార్టీ కండువా వేసి, శాలువా కప్పి ఘనంగా సత్కారించారు. సర్దార్ పటేల్ స్టేడియం నుంచి ఖమ్మం పట్టణంలోని పాత బస్టాండ్, కిమ్స్ హాస్పిటల్ ఏరియాలో ప్రారంభమైన రోడ్ షో లో ప్రజలకు అభివాదం చేస్తూ ప్రియాంక గాంధీ పాల్గోన్నారు

ఖమ్మం, పాలేరు, నియోజకవర్గాల్లో రోడ్ షో లో ఎఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పాల్గోన్నారు. ఈ కార్యక్రమంలో   సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఖమ్మం అభ్యర్థి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గోన్నారు.
ప్రియాంక గాంధీ మాట్లాడుతూ నిరుద్యోగులకు 10 సంవత్సరాలుగా ఉద్యోగాలు ఇవ్వని సీఎం కేసీఆర్ తన కుటుంబంలో మాత్రం ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు. ఉద్యోగాలు కావాలనుకునే నిరుద్యోగులు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గద్దె దింపండని అన్నారు.
కొలువులు ఇచ్చే కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. తెలంగాణ ఇచ్చింది కేసీఆర్, కేసీఆర్ కుటుంబం బాగు కోసం కాదు.  రైతులు, ఆడబిడ్డలు, యువత, విద్యార్థులు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నారు. మాయ మాటలతో అధికారంలోకి వచ్చిన బిఆర్ఎస్ ప్రభుత్వం మీ కలలను నిజం చేయలేదు. పది సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన బిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను భ్రష్టు పట్టించిందని అన్నారు.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న కొలువులను భర్తీ చేశాయి. ప్రజల సంపదను ప్రజలకు పంచాయి. యువతకు కొలువులు, అందరికీ ఇండ్లు, మహిళలకు ఆర్థిక స్వాలంబన అందించే పథకాలు, రైతులకు రుణమాఫీ చేసే ప్రభుత్వాన్ని తెలంగాణలో ఎన్నుకోవాలని ఆమె అన్నారు. తెలంగాణలో భారీ మెజార్టీతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటే ప్రజల సంపద ప్రజలకు అందుతుంది.
తెలంగాణలో మార్పు రావాలి. కాంగ్రెస్ కావాలి. మధిర కాంగ్రెస్ అభ్యర్థి భట్టి విక్రమార్కమల్లు, ఖమ్మం అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలను అత్యధిక మెజార్టీతో గెలిపించండని ఆమె కోరారు.

Related Posts