YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జొన్నగిరి ప్రాంతంలో వజ్రాల వేట

జొన్నగిరి ప్రాంతంలో వజ్రాల వేట

కర్నూలు, నవంబర్ 27,
ఆంధ్రప్రదేశ్‌లో ఒక మహిళకు అదృష్టం వరించింది. ఈ దెబ్బతో లక్షాధికారిగా మారిపోయింది. దీనికి కారణం మాత్రం కూలీ పని చేస్తూ జీవనం గడపడమే. అదేంటి కూలి పని చేసుకునే మహిళ లక్షలకు అధిపతి ఎలా అయిందనే అనుమానం మీలో కలుగుతోంది కదూ. అయితే ఈ స్టోరీ చూసేయాల్సిందే.  జొన్నగిరి ప్రాంతంలో వజ్రాల వేట కొనసాగుతోంది. దీని కోసం స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు క్యూ కడుతున్నారు.  వజ్రాల కోసం  రోజుల తరబడి పొలాల్లోనే వెతుకులాట ప్రారంభించారు.కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి మండలం జొన్నగిరిలో రైతు తన పొలంలో కంది పంట సాగు చేస్తుండగా, కొత్తగా ఉన్న రాయి దొరికింది. అలా దొరికిన రాయిని జొన్నగిరికి చెందిన వజ్రాల వ్యాపారికి చూపించగా అది వజ్రం అని ఆ రైతుకు చెప్పడంతో అతని ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. అందరు తమ పరిధిలో వజ్రాలు దొరుకుతున్నాయి అంటే అదృష్టం ఉండాలి అనుకునే వాడిని.. ఆలాంటి తనకే వజ్రం దొరకడం చాలా సంతోషంగా ఉందని ఆ రైతు ఆనందం వ్యక్తం చేశారు.దానిని వజ్రాల వ్యాపారి 6 లక్షల రూపాయలకు కొనుగోలు చేశారు. తనకు రెండు ఎకరాలు పొలం ఉందని కొందరు రైతులు జొన్నగిరి, పగిడిరాయి, కొత్తూరు,పెరవలి ప్రాంతాల్లో వజ్రాలు దొరుకుతున్నాయి అంటే నేను చాలాసార్లు అన్వేషించాను. అయితే నాకు ఎప్పుడు వజ్రం లభించలేదు. మొట్టమొదటిసారిగా పొలం పనులు చేస్తున్న నాకు రాయి కొత్తగా కనిపించడంతో ఆ రాయి తీసుకెళ్లి వజ్రాల వ్యాపారం చేసే వారికి చూపించాను. అతను ఇది వజ్రం అని తేల్చి ఆరు లక్షల రూపాయలు నగదు ఇవ్వడంతో రైతు ఆనందంలో మునిగిపోయారు.ఈ ఖరీఫ్ సీజన్లో ఇప్పటి వరకు 28 వజ్రాలు దొరికాయి  అని, వారం రోజులలో రెండు విలువైన వజ్రాలు దొరకడంతో కర్నూలు, బళ్లారి, గుంటూరు, హైదరాబాద్ నుండి వజ్రాల కోసం అధిక సంఖ్యలో తమ గ్రామానికి వస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. వజ్రం దొరికిన రైతు కుటుంబంలో ఆనందం వికసించింది.

Related Posts