YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

అర్బన్ లో ఓటింగ్ పై దృష్టి

అర్బన్ లో ఓటింగ్ పై దృష్టి

హైదరాబాద్, నవంబర్ 27,
వాళ్ళంతా చదువుకున్న వారే, పొద్దున నుండి రాత్రి వరకు ఉరుకు – పరుగుల జీవితాలు. వాళ్ళదంతా సిటీ కల్చర్ – రాజకీయాలు, రాజకీయ నాయకుల పై విశ్లేషణ చేస్తారు. కానీ ఓటు మాత్రం వేయరు. ఈసారి జరిగే ఎన్నికల్లో అర్బన్ ప్రజలతో ఓటు వేహించాలని టార్గెట్ గా పెట్టుకుంది ఎలక్షన్ కమిషన్. ఇందులో ఐటీ సెక్టార్ ఉద్యోగులే ఎక్కువ. మరి ఎన్నో ఏళ్లుగా వస్తున్న సంప్రదాయాన్ని మార్చి ఎన్నికల సంఘం ట్రెండ్ సెట్ చేస్తుందా..? లేదా అనేదీ చర్చనీయాంశం.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో 2014లో జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో అత్యధికంగా 73.20% పోలింగ్ నమోదైంది. 1983 నుంచి 2018 వరకు జరిగిన సాధారణ ఎన్నికల్లో అదే అత్యధిక పోలింగ్ శాతం. 1983 నుంచి జరిగిన 9 ఎన్నికల్లో సాధారణ ఎన్నికల ఓటింగ్ సరళిని పరిశీలిస్తే సగటున 67.57% పోలింగ్ నమోదైంది. ఈ సారి అత్యధిక పోలింగ్ శాతం నమోదవుతుందనే అంచనాలున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 3.26 కోట్ల ఓటర్లు ఉన్నారు.ఈసారి ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేశారు. చనిపోయినవారి పేర్లు తొలగించడం, ఒకటికి మించిన నియోజకవర్గాల్లో ఓటు హక్కు ఉన్న వారిని గుర్తించి వారి కోరిక మేరకు ఏదో ఒకచోటనే ఓటర్ల జాబితాలో పేరు ఉంచి, మిగతా చోట్ల తొలిగించడం లాంటి చర్యలు చేపట్టారు. రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి అనర్హుల ఓట్లను తొలిగించారు. దీనికితోడు ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కోరుతూ ప్రచారం చేస్తున్నారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు కూడా పోలింగ్ శాతం పెంపుదలపై దృష్టి సారించారు. దివ్యాంగులు, 80 ఏండ్లు దాటిన వారికి ఇంటి వద్దనే ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం కల్పించారు. ఇందులో భాగంగా 28 వేల మంది ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు.1983 లో 67శాతంతో మొదలై ప్రతీ ఏటా ఒకటి రెండు శాతం పెరుగుతూ 2018 వరకు 73శాతానికి మాత్రమే చేరింది. అయితే ఇప్పుడు జరిగే ఎన్నికల్లో కనీసం 80శాతానికి పైగా నమోదు అయ్యేలా చర్యలు తీసుకుంటుంది ఎలక్షన్ కమిషన్. ఎప్పుడూ రూరల్ ప్రాంతాల్లోనీ కొన్ని సెగ్మెంట్లలో 90శాతానికి పైగా పోలింగ్ శాతం ఉంటే అర్బన్ ప్రాంతాల్లో ఉన్న గ్రేటర్ హైదరాబాద్ లో మాత్రం 50శాతం దాటడం లేదు. ముఖ్యంగా నాంపల్లి నియోజకవర్గంలో 44శాతం, మలక్‌పేట్ సెగ్మెంట్‌లో 42, జూబ్లీహిల్స్ 45శాతం, చార్మినార్ 40, చంద్రాయణగుట్ట 46, యాకుత్‌పుర 41, సికింద్రాబాద్ 49, సికింద్రాబాద్ కంటోన్మెంట్ 48, ఎల్బీ నగర్ 49, శేరిలింగంపల్లి 48, బహదూర్ పురా 50, గోషామహల్ 58, కార్వాన్ 51, సనత్ నగర్ 52, ఖైరతాబాద్ 53, అంబర్ పేట్ 55 శాతం పోలింగ్ నమోదు అయింది. జిల్లాలోని ఉన్న అర్బన్ ప్రాంతాల్లో నిజామాబాద్ అర్బన్ 61 శాతం, వరంగల్ వెస్ట్ 58శాతం నమోదు అయింది.ఈసారి ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అర్బన్ ఓటు శాతంను పెంచాలని ఎలక్షన్ కమిషన్ ఏడాది ముందు నుంచే ప్రచారం చేస్తోంది. ఈసారి రూరల్ ఓట్లే కాకుండా, అర్బన్ ఓట్లు పెంచాలని మోడల్, ఊమెన్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. మరీ ఎలక్షన్ కమిషన్ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి..!

Related Posts