YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బీఆర్ఎస్ అభ్యర్ధిని అడ్డుకున్న దెందుకూరు గ్రామస్థులు

బీఆర్ఎస్ అభ్యర్ధిని అడ్డుకున్న దెందుకూరు గ్రామస్థులు

ఖమ్మం
మధిర మండలం దెందుకూరు గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి లింగాల కమల్ రాజు ను గ్రామస్తులు అడ్డుకున్నారు. మా గ్రామంలో ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు..? ఎక్కడ మీ సంక్షేమం అని ప్రశ్నించారు. గ్రామస్తుల తిరుగుబాటుతో సహనం కోల్పోయిన లింగాల కమల్ రాజ్ బూతులు అందుకున్నారు. తాగుబోతుల్లారా.. తాగుబోతుల మాటలు మాట్లాడతారా అంటూ నోటుకి వచ్చినట్లు మాట్లాడారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే తాట తీస్తా అంటూ గ్రామస్తులను బెదిరించారు. ఈ ఊరు మీదా..? అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. జాగ్రత్త తాట తీస్తా ఒక్కొక్కరికి అంటూ కోపంతో ఊగిపోయారు.
ప్రజలు ప్రశ్నిస్తే తట్టుకోలేక సహనం కోల్పోయి గ్రామస్తులు పట్టుకొని తాగుబోతుల అని తిట్టే సంస్కారహీనుడివి. నిన్ను ఎమ్మెల్యేని చేస్తే మీ అరాచకాలు పెట్రేగిపోతాయని గ్రామస్థులు నినాదాలు చేసారు. నీకు అభివృద్ధి అంటేనే ఏమీ తెలియదు ఓపిక లేని వ్యక్తివి నీవంటూ  గ్రామస్తులు కమల్ రాజు పై విమర్శలు గుప్పించారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలో దిగి గ్రామస్తులను సముదాయించి అయనను ప్రచారం చేసుకునేందుకు అవకాశం కల్పించారు.

Related Posts