తిరుమల శ్రీవారి దర్శనార్థం ఆదివారం రాత్రి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీకి కి ఘన స్వాగతం లభించింది. గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి కె. నారాయణస్వామి, రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి , డా. ఎం. గురుమూర్తి, ఎన్.రెడ్డెప్ప , జి.వి.ఎల్.నరసింహారావు, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి,ఎం. ఎల్.సి బల్లి కళ్యాణ్ చక్రవర్తి, శాసన సభ్యులు వర ప్రసాద్ రావు ఆదిమూలం , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కె ఎస్.జవహర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వర రెడ్డి . నగర మేయర్ శిరీష , కమిషనర్ హరిత, బిజెపి నాయకులు, స్వాగతం పలికినవారిలో వున్నారు.
శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని మోడీ
సోమవారం ఉదయం నైవేద్య విరా మ సమయంలో మహాద్వారం గుండా ఆయన ఆలయంలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా ప్రధానికి టీటీడీ ఛైర్మ న్, ఈవో, అర్చకులు స్వాగతం పలి కారు. ఆలయంలోకి ప్రవేశించిన ప్రధాని ధ్వజ స్తంభానికి మొక్కారు. అనంతరం మూలవిరాట్టును దర్శిం చుకున్నారు. ఆ తర్వాత హుండీలో కానుకలను సమర్పించారు. అనంత రం రంగనాయకుల మండపంలో అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం పలికి, శేషవస్త్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈఓ ధర్మారెడ్డి స్వామి వారి చిత్ర పటం, డైరీ, క్యాలండర్ లను ప్రధానికి అందించారు. మోదీ ఆలయం లోనే దాదాపు 50 నిమిషాలు గడిపా రు. అనంతరం రచన గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత హైదరాబాద్ కు పయనమవుతారు. ప్రధాని రాక సంద ర్భంగా తిరుమలలో ఆంక్షలు విధిం చారు. ప్రధాని వెళ్లే మార్గాలలో దుకా ణాలను మూయించారు.