YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఇక ప్రలోభాలకు తెర

ఇక ప్రలోభాలకు తెర

హైదరాబాద్, నవంబర్ 29,
నెల రోజుల పాటు ప్రచారంతో హోరెత్తిన వీధులు నిశబ్దంగా మారిపోయాయి. తెలంగాణ ఓటర్లు గురువారం ఓటు వేయడానికి సిద్ధమయ్యారు. నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. 119 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుండగా.. 13 నియోజకవర్గాల్లో సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్ ముగియనుంది. సిర్పూర్‌, బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలంలో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసింది. భద్రత పరంగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్ 3న తెలంగాణ ఎన్నికల ఫలితాలు రానున్నాయి.తెలంగాణ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగింది బీజేపీ నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు నడ్డా, మంత్రులు ప్రచారం చేశారు. ఇక రాష్ట్రం నుంచి బండి సంజయ్, కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్ ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సీనియర్ నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. రాష్ట్రం నుంచి రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, తీన్మార్ మల్లన్న ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ తరఫున సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ప్రచారం చేశారు. బీఎస్పీ తరుఫున మాయవతి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రచారం చేశారు.ఎన్నికల ప్రచారం ముగియడంతో మంగళవారం సాయంత్రం నుంచే అభ్యర్థులు ఓటర్లను ప్రలోభపెడుతున్నారు. డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రిజర్వ స్థానాల్లో కాకుండా జనరల్ స్థానాల్లో భారీగా డబ్బులు ఖర్చ పెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఓటుకు రూ.2 వేల నుంచి రూ.3 వేలు ఇస్తుండగా.. కొన్ని నియోజకవర్గాల్లో ఓటుకు రూ.5 వేల వరకు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఎన్నికల సంఘం ప్రలోభలపై దృష్టి పెట్టింది. డబ్బు, మద్యం పంపిణీ చేయకుండా చర్యలు తీసుకోనుంది. ఇప్పటికే ప్లైయింగ్ స్కాడ్లను అలర్ట్ చేశారు.ఎన్నికల షెడ్యూల్ విడుదల ముందే బీఆర్‌ఎస్‌ ప్రచారం మొదలు పెట్టింది. ఆ పార్టీ. అధినేత, సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులు రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేశారు. సీఎం కేసీఆర్ అక్టోబరు 15న అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన అనంతరం అదే రోజు హుస్నాబాద్లో జరిగిన ప్రజా ఆశీర్వాత సభలో పాల్గొన్నారు. అప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. రోజుకు రెండు, మూడు, నాలుగు చోట్ల జరిగిన ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్న కేసీఆర్.. మొత్తం 96 బహిరంగ సభల్లో పార్టీ అభ్యర్ధులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఇక మంత్రి కేటీఆర్ 60 రోజులు ప్రచారంలో పాల్గొన్నారు. 30 పబ్లిక్ మీటింగ్లు, 70 రోడ్‌షోలు 30కి పైగా ప్రత్యేక ఇంటర్వ్యూలు, 150కి పైగా టెలీ కాన్ఫరెన్స్‌లు నిర్వహించి. పార్టీ క్యాడర్లో జోష్ నింపారు.అధికారంలోకి వస్తే వంద రోజల్లో ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించింది. ఆ పార్టీ నేతలు కూడా ప్రచారంలో మరింత దూకుడుగా వ్యహరించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాష్ట్రంలో మొత్తం 10 సభల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 29 సభల్లో, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ 26 సభల్లో, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి 55 సభల్లో, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 3 సభల్లో, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ 10 సభల్లో, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ భఘేల్ 4 సభల్లో పాల్గొన్నారు.తెలంగాణలో పాగా వేయడమే లక్ష్యంగా పెట్టుకున్న కమలదళం ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే ప్రచారాన్ని ముమ్మరం చేసింది. జాతీయ నాయకత్వాన్ని ప్రచారంలోకి దింపింది. కర్ణాటక ఎన్నికల్లో ఓటమి చవిచూసిన అగ్రనాయకత్వం తెలంగాణపై దృష్టి కేంద్రీకరించి వ్యూహాత్మకంగా ప్రచారం నిర్వహించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమిత్‌షా, జేపీ నడ్డాతో పాటు కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, అనురాగ్ సింగ్ ఠాకూర్, సాధ్వీ నిరంజన్ జ్యోతి, భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులైన యూపీ సీఎం యోగి ఆదిత్యనాత్, గోవా సీఎం ప్రమోద్ సావంత్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిండే, అసోం సీఎం హిమంత బిశ్వశర్మ పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ తరఫున ప్రచారం నిర్వహించారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మొత్తం ఐదు రోజులు.. 8 సభలు, ఒక రోడ్ షోలో పాల్గొన్నారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బీసీ ఆత్మగౌరవ సభ, పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన మాదిగ ఉప కులాల విశ్వరూప మహాసభ, కామారెడ్డి, మహేశ్వరం, తూప్రాన్, నిర్మల్, మహబూబాబాద్, కరీంనగర్‌లో నిర్వహించిన సకలజనుల విజయ సంకల్ప సభ, హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి కాచిగూడ వీర్‌సావర్కర్ విగ్రహం వరకు నిర్వహించిన రోడ్‌షోలో మోదీ పాల్గొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో 8 ఎనిమిది రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొని 17 సభలు, 7 రోడ్ షోలలో ప్రసంగించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అయిదు రోజులు, 8 సభలు, 3 రోడ్ షోలలో పాల్గొన్నారు.

Related Posts